
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలు ఖాయం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
చెన్నై: ‘‘రాష్ట్రేతరులు ఇక్కడ అధికారం చేపట్టలేరనే మాటను అంగీకరిస్తున్నాం. కానీ ద్రావిడ పార్టీలు మాత్రమే అధికారం చేపడతాయనే మాటను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోం’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే సెంగోట్టయ్యన్, తమిళనాడులో ద్రావిడ పార్టీలు తప్ప వేరెవ్వరూ అధికారం చేపట్టలేరని వ్యాఖ్యానించగా, డీఎంకే సభ్యులు ఆయన్ని అభినందించారు. ఈ వ్యవహారంపై అన్నామలై కోయంబత్తూరులో స్పందిస్తూ.. ద్రావిడ పార్టీ అనే విషయంపై మరింత స్పష్టత కావాలన్నారు. తానూ ద్రావిడ బిడ్డనేనని, ఆ ప్రకారం, డీఎంకే, అన్నాడీఎంకే సభ్యులందరూ తనకు బంధువులవుతారన్నారు. ద్రావిడ బిడ్డనైన తాను భూమిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నానని, డీఎంకే, అన్నాడీఎంకేలో ఎంతమంది వ్యవసాయం చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 150 స్థానాలు సాధిస్తామని, భవిష్యత్తు ఎన్నికలు బీజేపీ-డీఎంకే మధ్యనే ఉంటాయని అన్నామలై స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి