నడ్డా గోవా పర్యటన ఖరారు

ABN , First Publish Date - 2021-07-22T00:11:06+05:30 IST

వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు..

నడ్డా గోవా పర్యటన ఖరారు

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రెండ్రోజుల గోవా పర్యటన ఖరారైంది. ఈనెల 23, 24 తేదీల్లో ఆయన గోవాలో పర్యటించనున్నారు. తొలుత ఈనెల 12న ఆయన గోవాలో పర్యటించాల్సి ఉండగా కారణాంతరాల వల్ల రద్దయింది.


గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం మంగళవారంనాడు న్యూఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌షా, పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుంది. స్వదేశ్ దర్శన్ స్కీమ్ కింద సుందరీకరణ చేపట్టిన చారిత్రక అగువడ జైలును ప్రారంభించాల్సిందిగా ప్రధానిని ప్రమోద్ సావంత్ కోరారు. ఆత్మనిర్భర్ స్వయంపూర్ణ ప్రోగ్రాం కింద గ్రామ పంచాయతీలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేశారు. గోవాలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్‌‌కు సన్నద్ధతపై వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోవాలోని 40 స్థానాల్లో 28 స్థానాలు బీజేపీవేనని, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకత్వమే లేదని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని వాగ్దానాలు చేసినా గోవా ప్రజలు తెలివైన వారని, కాంగ్రెస్ పార్టీని సీరియస్‌గా తీసుకోరని చెప్పారు.

Updated Date - 2021-07-22T00:11:06+05:30 IST