జాతీయ కార్యవర్గ భేటీలకు బీజేపీ ముమ్మర ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-06-03T22:45:52+05:30 IST

జాతీయ కార్యవర్గ భేటీలకు తెలంగాణ బీజేపీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సహా కేంద్ర కేబినెట్‌, బీజేపీ పాలిత సీఎంలు ఈ సమావేశానికి రానున్నారు.

జాతీయ కార్యవర్గ భేటీలకు బీజేపీ ముమ్మర ఏర్పాట్లు

హైదరాబాద్: జాతీయ కార్యవర్గ భేటీలకు తెలంగాణ బీజేపీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని సహా కేంద్ర కేబినెట్‌, బీజేపీ పాలిత సీఎంలు ఈ సమావేశానికి రానున్నారు. జులై 2, 3న హైటెక్స్ నోవాటెల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశమవుతుంది. సమావేశాల కోసం 30 కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్డుషోకు తెలంగాణ బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బీజేపీ పాలిత సీఎంల టైంను రాజకీయంగా వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కార్యకర్తలను గ్రూపులుగా విభజించి సీఎంలు, కేంద్రమంత్రులతో భేటీలు అవుతారు. తెలంగాణలో బలోపేతమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Updated Date - 2022-06-03T22:45:52+05:30 IST