సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: మేనిఫెస్టోలో బీజేపీ హామీ

ABN , First Publish Date - 2022-01-24T02:55:22+05:30 IST

60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్‌పీపీ 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో 20 స్థానాలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు..

సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: మేనిఫెస్టోలో బీజేపీ హామీ

కోహిమా: వివాదాస్పద సాయుధ బలగాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్‌పీఏ) ఉపసంహరించుకుంటామని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మణిపూర్‌లో ‘నాగా పీపుల్స్ ఫ్రంట్’తో బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. కాగా, ఆదివారం ఈ రెండు పార్టీలు కలిసి ‘పీపుల్స్ యాక్షన్ డాక్యూమెంట్ 2022’ అనే పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈ కార్యక్రమంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఉప ముఖ్యమంత్రి వై.జోయ్ కుమార్‌లతో పాటు ఇరు పార్టీల అధినేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సంగ్మా మాట్లాడుతూ ‘‘ఎన్‌పీపీ యొక్క నిబద్ధత, విజన్ ప్రజలకు తెలుసు. ఈ మేనిఫెస్టో చూస్తే ప్రజలు ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసుకుంటారు’’ అని అన్నారు. కాగా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లు రెండు, మూడు రోజు్లో ప్రకటిస్తామని సంగ్మా అన్నారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీలో ఎన్‌పీపీ 40 స్థానాలకు పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో 20 స్థానాలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.


నాగాలాండ్‌లో కొద్ది రోజుల క్రితం భారత జవాన్ల కాల్పుల్లో 13 మంది అమాయక ప్రజలు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఏఎఫ్ఎస్‌పీఏ చట్టాన్ని రద్దు చేయాలంటూ ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. వాస్తవానికి ఈ చట్టం రద్దు డిమాండ్ చాలా కాలంగానే ఉన్నప్పటికీ నాగాలాండ్ సంఘటనతో మరోసారి తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే ఆ చట్టం రద్దుకు బీజేపీ సైతం హామీ ఇచ్చింది.

Updated Date - 2022-01-24T02:55:22+05:30 IST