యూపీలో బీజేపీ ఎన్నికల హామీలివే...

ABN , First Publish Date - 2022-02-08T17:57:40+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 5వేల కోట్ల రూపాయలు వెచ్చించి చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, రైతులు పండించిన వరి, గోధుమలకు మద్ధతుధర కల్పిస్తామని...

యూపీలో బీజేపీ ఎన్నికల హామీలివే...

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 5వేల కోట్ల రూపాయలు వెచ్చించి చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, రైతులు పండించిన వరి, గోధుమలకు మద్ధతుధర కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మంగళవారం లక్నోలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే ఐదేళ్లలో రైతులందరికీ వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని అమిత్ షా ప్రకటించారు. కళాశాలల్లో చదివే విద్యార్థినులకు ఉచితంగా ద్విచక్రవాహనాలను అందిస్తామని అమిత్ షా విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నారు. 60 ఏళ్లు పైబడిన మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.


 దీపావళి, హోలి పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లను ఇస్తామని బీజేపీ హామీలిచ్చింది.యూపీలో 6 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేస్తామని అమిత్ షా వివరించారు. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన కార్యక్రమంలో యూపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు.


Updated Date - 2022-02-08T17:57:40+05:30 IST