ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ

Published: Thu, 14 Apr 2022 17:46:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఏపీలో దూకుడు పెంచిన బీజేపీ

అమరావతి: ఏపీలో బీజేపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ముప్పేట దాడి చేయాలని నిర్ణయించింది. విజయవాడ పార్టీ కార్యాలయంలో సోము వీర్రాజు, జీవీఎల్ భేటీ అయ్యారు. ఈ నెలలో కేంద్ర మంత్రులు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 17న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  విజయవాడకు రానున్నారు. ఈ నెల 25న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కడపకు రానున్నారు. విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ ఈ నెల చివరి వారంలో విశాఖలో పర్యటించనున్నారు. సమావేశం అనంతరం సమావేశ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని సోము వీర్రాజు, జీవీఎల్ తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.