బీసీ మంత్రులు ఎటువైపు?

ABN , First Publish Date - 2021-02-27T06:07:59+05:30 IST

రాష్ట్రంలో 54 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదని, 133 బీసీ కులాలు ఏకమై ప్రభుత్వ మెడలు వంచాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. బీసీ మంత్రులు జాతి వైపు నిలబడతారా... ప్రభుత్వం వైపు నిలబడతారో తేల్చుకోవాలన్నారు. బీజేపీ ఓబీసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్‌ పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన గొర్రెకాపర్ల రణభేరి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ బడుగులకు న్యాయం జరిగేంత వరకు మడమ తిప్పేదిలేదన్నారు.

బీసీ మంత్రులు ఎటువైపు?
ర్యాలీలో డోలు వాయిస్తున్న డాక్టర్‌ లక్ష్మణ్‌, రఘునందన్‌రావు

133 బీసీ కులాలు ఏకమై ప్రభుత్వ మెడలు వంచాలి

గొర్ల మంత్రికి సోయిలేదు.. మాయమాటలు చెబుతున్నాడు

కేసీఆర్‌ గడీలను బద్దలు కొడతాం

రాష్ట్రంలో రామరాజ్యం స్థాపిస్తాం

నిర్బంధాలతో పోరాటాన్ని ఆపలేరు

బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌


మెదక్‌ అర్బన్‌, ఫిబ్రవరి 26 : రాష్ట్రంలో 54 శాతం జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కలేదని, 133 బీసీ కులాలు ఏకమై ప్రభుత్వ మెడలు వంచాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు. బీసీ మంత్రులు జాతి వైపు నిలబడతారా... ప్రభుత్వం వైపు నిలబడతారో తేల్చుకోవాలన్నారు. బీజేపీ ఓబీసీ జిల్లాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్‌ పట్టణంలోని ఓ పంక్షన్‌హాల్‌లో నిర్వహించిన గొర్రెకాపర్ల రణభేరి సభకు ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ బడుగులకు న్యాయం జరిగేంత వరకు మడమ తిప్పేదిలేదన్నారు. బడుగు బలహీన వర్గాలు పస్తులుండి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ తెస్తే కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకు తింటుందని విమర్శించారు.  దుబ్బాక ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకున్నాయన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌ దొర గడీలను బద్దలు కొడతామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో రామరాజ్యం తీసుకొస్తామన్నారు. బీజేపీలో టీ అమ్మేవారిని ప్రధాని, దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసిందన్నారు. టీఆర్‌ఎ్‌సలో తండ్రి అధ్యక్షుడు, కొడుకు కార్యనిర్వాహక అధ్యక్షుడు, బుడ్డోనికి వయసు లేదు లేదంటే ఏదో పదవి ఇచ్చే వారని ఎద్దేవా చేశారు. బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. నిర్బంధాలు, అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరన్నారు. 

గొర్రెల పంపిణీలో విపరీతమైన అవినీతి జరిగిందని గొర్ల మంత్రి సోయిలేకుండా తప్పు లెక్కలతో మాయమాటలు చెప్తున్నారని లక్ష్మణ్‌ విమర్శించారు. అధికారులు, నాయకులు కుమ్మక్కై అమ్ముకుంటున్నారని ఆరోపించారు. గొర్రెల పంపిణీ పేరిట ప్రతీ గొల్లకుర్మ ఇంటి నుంచి ఒక్కొక్కరికి రూ.31,250 చొప్పున 28,500 డీడీలు కట్టించుకొన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.900 కోట్లను కట్టించుకుని మూడేళ్లయినా గొర్రెలివ్వడం లేదన్నారు. మొదటివిడతలోనే సగం మందికే మాత్రమే గొర్రెల పంపిణీ చేశారన్నారు. గొల్లకుర్మలకు గొర్రెలతో పాటు అదనంగా రూ.లక్షా 25 వేలు నేరుగా ఖాతాల్లోకి జమ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గొర్లు మేపడానికి ప్రత్యేక స్థలాలు కేటాయించాలన్నారు. 50 ఏళ్లు నిండిన గొర్రెలకాపర్లకు రూ.3 వేల పెన్షన్‌, ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.  

బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో చేపట్టిన చలో కలెక్టరేట్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సభ అనంతరం నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీతో కలెక్టరేట్‌ ముట్టడికి బయలుదేరారు. రాందా్‌సచౌరస్తా నుంచి కలెక్టరేట్‌కు ర్యాలీని ప్రారంభించారు. మార్గమధ్యలోని మార్కెట్‌యార్డు వద్ద పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టి బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకున్నది. పోలీసులు వారిని చెదరగొట్టడానికి లాఠీచార్జ్‌ చేశారు. ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపి, ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లేశం, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులుతో పాటు పలువురు బీజేపీ నేతలను అరెస్టు చేసి వాహనాల్లో కొల్చారం పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

Updated Date - 2021-02-27T06:07:59+05:30 IST