Munugodu By Poll: మునుగోడుపై బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టిందిగా.. ఏ రేంజ్‌లో అంటే..

Published: Tue, 16 Aug 2022 14:42:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Munugodu By Poll: మునుగోడుపై బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టిందిగా.. ఏ రేంజ్‌లో అంటే..

నల్లగొండ: తెలంగాణలో ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక (Munugode By Poll) హాట్ టాపిక్‌గా మారింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశాయి. స్థానికంగా వ్యక్తమవుతున్న అసంతృప్త జ్వాలలను చల్లార్చే పనిలో ఉన్నాయి. గత ఎన్నికల్లో మునుగోడు (Munugodu) నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా (Congress) ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీలో చేరాలని నిర్ణయించుకుని కాంగ్రెస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జరగనున్న ఉప ఎన్నిక కావడంతో టీఆర్‌ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP).. ఈ మూడు పార్టీలు మునుగోడు ఉప ఎన్నికను (Munugode By Election) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీజేపీకి (BJP), మరీ ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి (Komatireddy Rajagopal Reddy) మునుగోడు ఉప ఎన్నికలో గెలుపు చాలా అవసరం. కాంగ్రెస్ పార్టీకి (Congress), పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (PCC Chief Revanth Reddy) మునుగోడు ఉప ఎన్నిక ఒక సవాల్ అని చెప్పక తప్పదు. అధికార టీఆర్‌ఎస్‌కూ ఈ ఉప ఎన్నిక (By Poll) కీలకంగా మారనుంది. తాజాగా బీజేపీ మునుగోడుపై వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నట్లు తెలిసింది.


మునుగోడు ఉప ఎన్నికపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ (BJP Focus On Munugode) పెట్టింది. ఆగస్ట్ 21న మునుగోడులో అమిత్ షా సభ (Munugodu Amit Shah Meeting) జరగనుంది. అమిత్ షా సభ తర్వాత స్థానిక బీజేపీ నేతలు ఏం చేయాలనే విషయంలో కూడా బీజేపీ హై కమాండ్ ఇప్పటికే క్లియర్‌గా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22 నుంచి మునుగోడులో బీజేపీ నేతలు మకాం వేయనున్నారు. ఈ నెల 21న అమిత్‌షా సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. ఉప ఎన్నిక కోసం కమలం పార్టీ ఎన్నికల కమిటీ (Election Committee) వేయనుంది. అమిత్‌షా (Amit Shah) సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మునుగోడు బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి బరిలో దిగనున్నారన్న విషయం తెలిసిందే. రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిత్వంతో బలం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది. ఉప ఎన్నిక ప్రచారానికి కేంద్ర మంత్రులు (Union Ministers), జాతీయ నేతలు కూడా రానున్నారంటే ఒక మినీ అసెంబ్లీ ఎన్నికల సీన్ కనిపించనుందన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


ఉప ఎన్నికను బీజేపీ అధిష్ఠానంతో (BJP High Command) పాటు కోమటిరెడ్డి బ్రదర్స్‌ (Komatireddy Brothers) రాజకీయ జీవితానికి సవాల్‌గా మారడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనులకు శ్రీకారం చుట్టారు. బీజేపీ కీలక నేతలు (BJP Leaders) ఈటల రాజేందర్‌ (Etela Rajender), వివేక్‌ (Vivek), జితేందర్‌రెడ్డి (jithender reddy) కీలక బాధ్యతలు తీసుకోనున్నారు. రాజేందర్‌ అత్తగారి ఊరు మునుగోడు మండలం పలివెల. ఈ గ్రామం కేంద్రం గానే తన కార్యకలాపాలు నిర్వహించేందుకు రాజేందర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతను మాజీ ఎంపీ వివేక్‌కు (Ex MP Vivek) అప్పగించాల్సిందిగా రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) బీజేపీ రాష్ట్ర నేతలను (BJP State Leaders) కోరారు. ఎన్నికల నిర్వహణలో దిట్టగా పేరొందిన మహబూబ్‌నగర్‌ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి (Mahabubnagar Ex MP) త్వరలో మునుగోడులో (Munugodu) మకాం వేయనున్నారు. ఈ ముగ్గురితోపాటు మరో ఇద్దరితో కీలక కమిటీని త్వరలో బీజేపీ (BJP) ఖరారు చేయనున్నట్లు తెలిసింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.