
లక్నో: బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శలు గుప్పించారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాను బీజేపీ నడుపుతోందని, మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నదని బీఎస్పీ అధినేత్రి మాయావతి బుధవారం ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తన కులతత్వ మరియు పెట్టుబడిదారీ విధానాలను మరియు ఆర్ఎస్ఎస్ సంకుచిత అజెండాను అమలు చేయడంలో బిజీగా ఉందని లక్నోలో ఎన్నికల ర్యాలీలో యూపీ మాజీ సీఎం అన్నారు. "మతం పేరుతో ద్వేషం మరియు ఉద్రిక్తత వాతావరణం ఉందని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి