రైతులకు అండగా ఉండలేకపోతున్నాం

ABN , First Publish Date - 2020-08-09T09:49:42+05:30 IST

రాజధానికి 34 వేల ఎకరాలు త్యాగం చేసినరైతుల పక్షాన తమ పార్టీ అండగా ఉండలేకపోతోంది.... అని బీజేపీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ తన చెప్పుతో తానే

రైతులకు అండగా ఉండలేకపోతున్నాం

  • మందడం రైతు శిబిరంలో చెప్పుతో కొట్టుకున్న నాయకుడు
  • బీజేపీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ తీవ్ర ఆవేదన
  • రైతులకు అండగా ఉండలేకపోతున్నాం 


తుళ్లూరు, ఆగస్టు8 : రాజధానికి 34 వేల ఎకరాలు త్యాగం చేసినరైతుల పక్షాన తమ పార్టీ అండగా ఉండలేకపోతోంది.... అని బీజేపీ అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ తన చెప్పుతో తానే కొట్టుకున్నారు. శనివారం ఆయన మందడం రైతు శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ‘జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అమరావతికి ఒప్పుకొన్నాడు.


కానీ నేడు వైసీపీ ప్రభుత్వం తమను కష్టాలపాలు జేసిందని, బీజేపీ ఆదుకుంటుందని రైతులు భరోసా పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా రాజధాని తరలింపునకు నేను వ్యతిరేకం. ఈ రోజు పరిస్థితి చూస్తే నా చెప్పుతో నేను కొట్టుకునే పరిస్థితి కల్పించారు. నేను పార్టీ కార్యాలయం కోసం ఇచ్చిన స్థలంలో నిర్మాణం చేపట్టకపోతే, దానిని విక్రయించి ఆ సొమ్మును రైతుల పోరాటానికి ఇస్తాన’న్నారు. 

Updated Date - 2020-08-09T09:49:42+05:30 IST