Annamalai: మత రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం

ABN , First Publish Date - 2022-09-02T14:44:50+05:30 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)

Annamalai: మత రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం

                                        - బీజేపీ నేత అన్నామలై


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 1: ముఖ్యమంత్రి స్టాలిన్‌ మత రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. నగరంలో గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, వినాయక చవితికి సెలవు ప్రకటించింది అప్పటి డీఎంకే ముఖ్యమంత్రి అన్నాదురై అని, ప్రస్తుతం అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి(Chief Minister) వినాయక చవితి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలపకపోగా, దేవాదాయ శాఖ భక్తులకు శుభాకాంక్షలు తెలిపితే ఆ పార్టీ ఎంపీ ఖండించారన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కాంక్షిస్తూ సీఎం పాలన సాగించాలని అన్నామలై కోరారు.

Updated Date - 2022-09-02T14:44:50+05:30 IST