రాష్ట్రంలో మళ్లీ అధికారం బీజేపీదే...

ABN , First Publish Date - 2022-04-20T18:11:44+05:30 IST

రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికరంలోకి రావడం ఖాయం... అలాగే నరేంద్రమోదీ పీఎం అయ్యేదీ తథ్యం ఈ దిశగా బీజేపీ అన్ని అడుగులూ వేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు

రాష్ట్రంలో మళ్లీ అధికారం బీజేపీదే...

బళ్లారి(కర్ణాటక): రాష్ట్రంలో మళ్లీ బీజేపీ అధికరంలోకి రావడం ఖాయం... అలాగే నరేంద్రమోదీ పీఎం అయ్యేదీ తథ్యం ఈ దిశగా బీజేపీ అన్ని అడుగులూ వేస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటిల్‌ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ జిల్లా స్థాయి కోర్‌ కమిటీ సమావేశం మంగళవారం బళ్లారి జిల్లాలో నిర్వహించారు. ఇందులో బాగంగా కటిల్‌ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్‌ శెట్టర్‌, ఎంపీ దేవేంద్రప్ప, ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, సోమలింగప్ప, ‘బుడా’ అధ్యక్షుడు పాలన్న, బీజేపీ ప్రచారకర్త డాక్టర్‌ బీకేఎస్‌ సుంధర్‌, జిల్లా అధ్యక్షుడు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కటిల్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇతర అంశాలు తెలుసుకునేందుకు 3 కమిటీలు వేశామన్నారు. ఒక కమిటీ సీఎం, మరో కమిటీ మాజీ సీఎం యడియూరప్ప్ప, మూడో కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కటిల్‌ నాయకత్వంలో పని చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజల బాగోగులు తెలుసుకునేందుకు ఈ కమిటీలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలపై ఆరా తీస్తాయాన్నారు. అనంతరం కోర్‌ కమిటీ నిర్వహించారు. పార్టీ పరంగా దిశనిర్దేశాలు చర్చించారు. కోర్‌ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు రాజీవ్‌, ఈడిగ సంజయ్‌, డాక్టర్‌ సుంధర్‌, ఏపీఎంసీ అధ్యక్షుడు ఉమేష్‌, రాజశేఖర్‌గౌడ పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-20T18:11:44+05:30 IST