TS News: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: పొన్నం ప్రభాకర్

ABN , First Publish Date - 2022-08-04T01:19:36+05:30 IST

బీజేపీ, టీఆర్ఎస్ (BJP TRS) రెండూ ఒక్కటేనని ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్వజమెత్తారు.

TS News: బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒక్కటే: పొన్నం ప్రభాకర్

కరీంనగర్: బీజేపీ, టీఆర్ఎస్ (BJP TRS) రెండూ ఒక్కటేనని ఎంపీ పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై ఈడీని ఎందుకు ప్రయోగించడం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీకి కేసీఆర్ కావాలనే బలం పెంచుతున్నారని ఆరోపించారు. తెలంగాణను వ్యతిరేకించిన బీజేపీలోకి రాజగోపాల్‌ ఎలా వెళ్తారు? అని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ గెలవడం ఖాయమని పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-08-04T01:19:36+05:30 IST