బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్య ఉన్న ఒప్పందం బహిర్గతం చేయాలి: రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-12-23T02:27:11+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్య ఉన్న ఒప్పందం బహిర్గతం చేయాలి: రేవంత్‌రెడ్డి

ఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాక్షస క్రీడలో రైతులు బలవుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై కేంద్రమంత్రి అమిత్‌షా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్‌కు మధ్య ఉన్న ఒప్పందం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజాన్ని బీజేపీ, టీఆర్ఎస్ మోసం చేస్తున్నాయని రేవంత్ దుయ్యబట్టారు. బీజేపీ నేత బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఢిల్లీలో వీధినాటకాలు మొదలెట్టారని మండిపడ్డారు. రాజకీయ వైషమ్యాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందడం తప్ప.. రైతాంగ ప్రయోజనాలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ తన వ్యూహాల మీద నమ్మకం కోల్పోయి.. సునీల్ అనే రాజకీయ వ్యూహకర్త డైరెక్షన్‌లో నడుస్తున్నారని విమర్శించారు. సునీల్ అనే వ్యూహకర్త బీజేపీ, టీఆర్ఎస్‌లకు నాయకుడిగా మారారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Updated Date - 2021-12-23T02:27:11+05:30 IST