బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ

Published: Sun, 03 Jul 2022 18:38:39 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ

సికింద్రాబాద్: బీజేపీ విజయ సంకల్ప సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అంతకుముందు ఆయన హెచ్‎ఐసీసీ నుంచి హెలికాప్టర్ లో బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన వాహనంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ వేదికకు వెళ్లారు. సభా వేదికకు మోదీ చేరుకోగానే ఒక్కసారిగా ఆ ప్రాంగణమంతా బీజేపీ కార్యకర్తల అరుపులు,  కేకలతో దద్దరిల్లింది. మోదీకి ఘన స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. జై బీజేపీ అంటూ సభా ప్రాంగణమంతా మారుమోగిపోయింది. Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.