BJP vs TRS: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిన సెప్టెంబర్ 17

ABN , First Publish Date - 2022-09-15T17:33:46+05:30 IST

సెప్టెంబర్ 17.. బీజేపీ (BJP) వర్సెస్ (Vs) టీఆర్ఎస్‌ (TRS)గా మారింది.

BJP vs TRS: బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిన సెప్టెంబర్ 17

హైదరాబాద్ (Hyderabad): సెప్టెంబర్ 17.. బీజేపీ (BJP) వర్సెస్ (Vs) టీఆర్ఎస్‌ (TRS)గా మారింది. సెప్టెంబర్ 17 (September 17)ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుతున్న తెలంగాణ సర్కార్.. తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుతామన్న బీజేపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బీజేపీ, టీఆర్ఎస్‌లు  పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. సెప్టెంబర్ 17 శనివారం పరేడ్ గ్రౌండ్‌లో‌ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ‌ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. అదే రోజున ఎన్టీఆర్ గ్రౌండ్‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం సభ నిర్వహించనుంది. 


కాగా గురువారం ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయం‌ వద్ద నుంచి ఆరెంజ్ బ్రిగేడ్ ర్యాలీ ప్రారంభమైంది. బీజేపీ ఆధ్వర్యంలో వందల మంది మహిళలతో ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ ముందున్న సర్దార్ పటేల్ విగ్రహం వరకు మహిళల బైక్ ర్యాలీ జరుగుతుంది. సెప్టెంబరు 17న కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ విమోచన అమృత మహోత్సవాలు నిర్వహించనుంది. అమృత మహోత్సవాల్లో భాగంగా పార్టీ తరుపున బీజేపీ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Updated Date - 2022-09-15T17:33:46+05:30 IST