Taliban వ్యవస్థ తయారీకి BJP ప్రయత్నాలు: Shivsena

ABN , First Publish Date - 2022-05-13T19:17:45+05:30 IST

జవహార్ రాథోడ్ రాసిన పథర్వత్ అనే కవిత సంపుటిని గురువారం పవార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన పుస్తకంలోని కొన్ని వాఖ్యాలను సభకు హాజరైన వారికి చదివి వినిపించారు. ‘‘భగవాన్ బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. మనుషుల్ని సమస్తాల్ని..

Taliban వ్యవస్థ తయారీకి BJP ప్రయత్నాలు: Shivsena

ముంబై: దేశంలో తాలిబన్ లాంటి వ్యవస్థను తయారు చేయడానికి Bharatiya Janata Party ప్రయత్నిస్తోందని Shiv Sena విమర్శించింది. Nationalist Congress Party అధినే Sharad Pawar పై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై శివసేన అధికారిక పత్రిక స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలో శాంతిని చెడగొట్టే విధంగా బీజేపీ భయంకర రాజకీయాలకు పాల్పడుతోందని సామ్నాలో తీవ్ర విమర్శలు చేశారు. రాసేవాటిని, చదివేవాటిని సెన్సార్ చేయాలని చూస్తే ‘పథర్వత్’ ఉద్యమం మరింత తీవ్ర అవుతుందని శివసేన హెచ్చరికలు చేసింది.


జవహార్ రాథోడ్ రాసిన పథర్వత్ అనే కవిత సంపుటిని గురువారం పవార్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన పుస్తకంలోని కొన్ని వాఖ్యాలను సభకు హాజరైన వారికి చదివి వినిపించారు. ‘‘భగవాన్ బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. మనుషుల్ని సమస్తాల్ని సృష్టించాడు. అయితే ఆ భగవంతుడిని (ప్రతిమ) ఒక కూలీ తయారు చేశాడు. కవి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించినవాడా లేదంటే మనమే అతినిని సృష్టించిన వాళ్లమా (విగ్రహాలు రూపొందించడం)?’’ అని పవార్ అన్నారు. కాగా, దీనిపై పెద్ద ఎత్తున దాడికి దిగింది. పవార్‌ ప్రసంగానికి చెందిన వీడియోను ఎడిట్ చేసి.. పవార్ నాస్తికుడని, హిందూ ద్వేషి అని ప్రచారం చేశారు.


బీజేపీ విమర్శలపై పవార్ స్పందించారు. అయితే బీజేపీ పేరును ప్రస్తావించకుండా ‘‘రాళ్లను దేవుళ్లుగా మలిచిన కూలీల హృదయ ఘోషను రచయిత బాగా వినిపించారు. పద్యం నొప్పిని వర్ణించింది. కానీ కొంత మంది ఇలాంటివి అర్థం చేసుకోకుండా తప్పుడు ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. నిజానికి అలాంటి వారికి ఇప్పుడు చాలా స్వేఛ్చ ఉంది’’ అని పవార్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ప్రజలు చాలా తెలివైన వారని, ఇందిరగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ఆమెను అధికారం నుంచి దింపేసి తగిన గుణపాఠం నేర్పారని, నాయకులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

Read more