గోవా సీఎంని బీజేపీ మారుస్తుంది: మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2021-10-24T00:32:12+05:30 IST

గోవా ముఖ్యమంత్రిని మార్చే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉందని ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. శనివారం ఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ఆయన..

గోవా సీఎంని బీజేపీ మారుస్తుంది: మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ: గోవా ముఖ్యమంత్రిని మార్చే యోచనలో భారతీయ జనతా పార్టీ ఉందని ఢిల్లీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా అన్నారు. శనివారం ఢిల్లీలోని ఆప్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రమోద్ సావంత్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తే గోవాలో ఓడిపోతామని బీజేపీ అధిష్టానం భావిస్తోందని, ఎన్నికలు మరో రెండు మూడు నెలలు ఉన్నాయన్న సమయంలో ముఖ్యమంత్రిని మార్చే అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు.


‘‘బీజేపీని చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాం. వాళ్లు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అంచనా వేయొచ్చు. ప్రస్తుతం గోవాలో బీజేపీపై చాలా వ్యతిరేకత ఉంది. దానికి కారణం ప్రమోద్ సావంత్. ఆయన నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తే బీజేపీ ఓడిపోవడం ఖాయం. ఈ భయం బీజేపీ నాయకత్వానికి కూడా ఉంది. అందుకే ఎన్నికలు ఇంకో రెండు మూడు నెలలు ఉన్నాయగా ముఖ్యమంత్రిని బీజేపీ మార్చేస్తుంది’’ అని సిసోడియా అన్నారు.

Updated Date - 2021-10-24T00:32:12+05:30 IST