యూపీలో బీజేపీ విజయానికి 5 కారణాలు!

ABN , First Publish Date - 2022-03-10T18:28:02+05:30 IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయంలో 5 అంశాలు కీలక పాత్ర పోషించాయి.

యూపీలో బీజేపీ విజయానికి 5 కారణాలు!

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయంలో 5 అంశాలు కీలక పాత్ర పోషించాయి. 


1. మాఫియాపై ఉక్కుపాదం

2. డబుల్ ఇంజన్ ప్రభుత్వం 

3. పాలనలో యోగి ముద్ర

4. అయోధ్య రామ మందిర నిర్మాణం

5. ట్రిపుల్ తలాక్ 


1. మాఫియాపై ఉక్కుపాదం: 


ఒకప్పుడు శాంతి భద్రతలు మృగ్యమనుకున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ మాఫియాపై ఉక్కుపాదం మోపింది. రౌడీషీటర్లను ఎన్‌కౌంటర్ చేయడం లేదా జైళ్లలో వేశారు. కొందరు రౌడీలు రాష్ట్రం వదిలి పారిపోయారు. గ్యాంగ్‌స్టర్‌ల ఇళ్లను, స్థావరాలను యోగి ప్రభుత్వం బుల్‌డోజర్లతో కూల్చేసింది. 


2. డబుల్ ఇంజన్ ప్రభుత్వం 


కేంద్రంలో మోదీ- యూపీలో యోగి ప్రభుత్వాలుంటే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఓటర్లకు అర్థమయ్యేలా చెప్పారు. ఉమ్మడి ప్రాజెక్టులకు, నిధులకు ఢోకా ఉండబోదని ప్రచారం చేశారు.          


3. పాలనలో యోగి ముద్ర


సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే అజెండాతో పనిచేయడం బీజేపీకి కలిసొచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో కొన్ని వర్గాల సంతుష్టీకరణ విధానాలకు యోగి సర్కారు గుడ్‌బై చెప్పడం కూడా విజయానికి కారణమైంది.  


  

4. అయోధ్య రామ మందిర నిర్మాణం


అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్న అయోధ్య రామమందిర అంశం కోర్టు ద్వారా పరిష్కారం కావడం యోగి సర్కారుకు బాగా కలిసొచ్చింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా భూసేకరణ జరిగి భవ్యమైన రామమందిర నిర్మాణం కొనసాగుతుండటం అడ్వాంటేజ్‌గా మారింది. గంగా నది ప్రక్షాళన, కాశీలో ఆలయ విస్తరణ పనులు హిందువుల సెంటిమెంట్ పెంచాయి.                                


5. ట్రిపుల్ తలాక్ 


ట్రిపుల్ తలాక్‌ను తొలగించడం ద్వారా ముస్లిం మహిళలకు విముక్తి కల్పించడం బీజేపీకి కలిసొచ్చింది. 


అన్ని వర్గాల ప్రజలు బీజేపీ సుపరిపాలనకు ఓటేయడం వల్లే గెలిచామని యూపీ కమలనాథులంటున్నారు.

Updated Date - 2022-03-10T18:28:02+05:30 IST