Black Betunia: కున్నూరులో విరబూసిన ‘బ్లాక్‌ బెటూనియ’

ABN , First Publish Date - 2022-08-03T16:45:53+05:30 IST

నీలగిరి జిల్లా కున్నూరులో అరుదైన ‘బ్లాక్‌ బెటూనియ’(Black Betunia) వికసించింది. ప్రస్తుతం కున్నూరు గ్రేస్‌ హిల్‌ ప్రాంతంలో ఉషా ఫ్రాంక్లిన్‌ అ

Black Betunia: కున్నూరులో విరబూసిన ‘బ్లాక్‌ బెటూనియ’

ఐసిఎఫ్‌(చెన్నై), ఆగస్టు 2: నీలగిరి జిల్లా కున్నూరులో అరుదైన ‘బ్లాక్‌ బెటూనియ’(Black Betunia) వికసించింది. ప్రస్తుతం కున్నూరు గ్రేస్‌ హిల్‌ ప్రాంతంలో ఉషా ఫ్రాంక్లిన్‌ అనే మహిళ ఇంట్లో పెంచుతున్న పూలమొక్క వికసించి కనువిందు చేస్తోంది. కేరళ మలప్పురం(Kerala Malappuram) జిల్లా నుంచి ఈ మొక్కను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. దీని గురించి వృక్షశాస్త్ర పరిశోధకులు మాట్లాడుతూ.. ఈ పువ్వులు త్వరగా వాడిపోవని, ఒక మొక్కకు పదికి పైగా పూలు పూస్తాయని తెలిపారు.

Updated Date - 2022-08-03T16:45:53+05:30 IST