Viral Video: గుటకలు వేస్తూ మంచి నీళ్లు తాగుతున్న Black Cobra.. చూస్తే అవాక్కవడం ఖాయం..!
ABN , First Publish Date - 2021-11-24T20:40:22+05:30 IST
సాధారణంగా పాములంటే చాలా మంది భయపడతారు. వాటిని చూస్తేనే చాలా మందికి గుండె ఆగినంత పనవుతుంది.
సాధారణంగా పాములంటే చాలా మంది భయపడతారు. వాటిని చూస్తేనే చాలా మందికి గుండె ఆగినంత పనవుతుంది. అయితే పాములకు సంబంధించిన అరుదైన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాములు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక భారీ బ్లాక్ కోబ్రా గ్లాస్లో నుంచి నీటిని తాగుతున్న వీడియోను `రాయల్ పైథాన్స్` తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ నెల 15న పోస్ట్ చేసింది. ఒక వ్యక్తి గ్లాసుతో నీటిని పట్టుకుని నిల్చోగా.. బ్లాక్ కోబ్రా తన దాహం తీర్చుకుంది. ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో ఇప్పటికే 1.25 లక్షల వ్యూస్ దక్కించుకుంది.