బ్లాక్‌ మార్కెట్‌లో రెమ్‌డిసివిర్‌ టీకా

May 9 2021 @ 11:32AM

  - బళ్లారిలో హోటల్‌పై పోలీసుల దాడి... ఒకరి అరెస్టు 

  - గంగావతిలో 150 టీకాల స్వాధీనం


బళ్లారి(కర్ణాటక): బళ్లారి నగరంలో అక్రమంగా దాచి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముతున్న రెమ్‌డిసివిర్‌ టీకాను జిల్లా పోలీసులు స్వాదీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సైదుల్లా అదావత్‌ తెలిపారు. శనివారం ఈ విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమయంలో కోవిడ్‌ బాధితులకు అందించే  రెమ్‌డిసివిర్‌ టీకా ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిల్లో కొరతను దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఈ టీకాను సేకరించి బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. ఈ విషయంపై తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం రాత్రి స్థానిక ఒక హోటల్‌లో దాడి నిర్వహించి అక్రమంగా దాచిన ఆరు రెమ్‌డిసివిర్‌ టీకాలను స్వాధీనం చేసుకున్నాట్లు, ఈ దాడిలో కిషోర్‌ అను వ్యక్తిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మార్కెట్‌లో ఒక టీకా రూ 3వేల నుంచి 4వేల ధర పలుకుతోందని, అయితే ప్రస్తుతం ఈ టీకా కొరతను ఆసరాగా చేసుకున్న వ్యక్తులు ఒక్కోటీకా రూ 25వేల నుంచి 30వేల దాకా బ్లాక్‌ మార్కెటలో విక్రయిస్తున్నట్లు విచారణలో బహిర్గతమైందన్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగతోందన్నారు. అరెస్టు చేసిన వ్యక్తి వెనక పలువురు ఉన్నట్లు తెలిసింది, వారికోసం గాలిస్తున్నట్లు ఎస్పీ మీడియా వివరించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.