16 ఏళ్ల నల్లజాతీయురాలి కాల్చివేత

ABN , First Publish Date - 2021-04-22T12:21:50+05:30 IST

జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించిన కొన్ని గంటల్లోనే అమెరికా పోలీసులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ 16 ఏళ్ల నల్లజాతీయురాలిపై కాల్పులు జరిపారు. ఆమె చేతిలో కత్తి పట్టుకుని ని

16 ఏళ్ల నల్లజాతీయురాలి కాల్చివేత

వాషింగ్టన్: జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య కేసులో కోర్టు తీర్పు వెలువరించిన కొన్ని గంటల్లోనే అమెరికా పోలీసులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ 16 ఏళ్ల నల్లజాతీయురాలిపై కాల్పులు జరిపారు. ఆమె చేతిలో కత్తి పట్టుకుని నిల్చుందని, అందుకే కాల్చేశామని ఆ తర్వాత వెల్లడించారు. కొలంబ్‌సలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. బాధితురాలిని మఖియా బ్రియాంట్‌గా గుర్తించారు. కొందరు గుమిగూడి ఉన్న ప్రదేశానికి చేరుకున్న పోలీసులు.. అక్కడ కత్తి లాంటి ఒక వస్తువుతో నిలబడి ఉన్న అమ్మాయిపై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. పోలీసుల తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.


Updated Date - 2021-04-22T12:21:50+05:30 IST