Adi saikumar : ఆకట్టుకుంటున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘బ్లాక్’ ట్రైలర్

Published: Tue, 24 May 2022 10:33:33 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Adi saikumar : ఆకట్టుకుంటున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ బ్లాక్ ట్రైలర్

మొన్నామధ్య ‘అతిథి దేవో భవ’ (Athidhi devobhava) అనే మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించాలనుకున్నాడు యంగ్ హీరో ఆది సాయికుమార్ (Adi saikumar) . కానీ ఆ సినిమా కూడా అతడి గత చిత్రాల్లాగానే మిస్ ఫైర్ అయింది. ప్రస్తుతం ఆరేడు చిత్రాలకు పైగానే నటిస్తున్నాడు. వాటిలో ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైనా ఆది కెరీర్ తిరిగి గాడిలో పడుతుంది. ఈ క్రమంలో ఆది నటిస్తున్న తాజా చిత్రం ‘బ్లాక్’ (Black) విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 28న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ‘బ్లాక్’ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.  ప్రామిసింగ్ గా అనిపిస్తోంది ట్రైలర్. పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా ఆది నటిస్తున్న ఈ సినిమాకి జీబీ కృష్ణ (GB Krishna) దర్శకుడు. మహంకాళి దివాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) సంగీతం అందిస్తున్నాడు. 


‘ఒకోసారి లైఫ్ మనకి కావల్సింది ఇవ్వదు. మనకు నచ్చినట్టు వెళ్ళనివ్వదు. దానికి నచ్చిందే ఇస్తుంది. నచ్చినట్టే తీసుకెళుతుంది. బట్, దానికో రీజనుంది’ .. అనే ఆది (Adi) వాయిస్ పై ట్రైలర్ ఓపెన్ అవుతుంది. రకరకాల విజువల్స్ తో అతడో సిన్సియర్ పోలీసాఫీసరని రివీలవుతుంది. ‘ఆదిత్య పతంజి ఆన్ డ్యూటీ సార్.. ఓవర్.. అని వాకీ టాకీలో రిపోర్ట్ చేస్తుండగా... ఒక అందమైన అమ్మాయి ఒక స్కూటీలో వచ్చి హెల్మెట్ తీసి రీవీలవుతుంది. ఆమెను చూసి ఫ్లాటయిపోయిన ఆ పోలీసాఫీసర్ ..  బ్రహ్మదేవుడు మనస్ఫూర్తిగా డిజైన్ చేసి.. భూలోకానికి పంపినట్టు ఏముంది రా అమ్మాయి..  మనసులో అనుకుంటాడు. ఆ అమ్మాయి ఆ పోలీస్ తో ధైర్యంగా.. చూడగానే భయపడి బెండై ఫైన్ కట్టేయడానికి నార్మల్ నైంటీస్ అమ్మాయిని కాదు. 2కె బేటీని’.. అంటూ మాటలు విసురుతుంది. ఆపై ఆ ఇద్దరి ప్రేమ వ్యవహారం సాగుతుండగా.. సిటీలో రాబరీ, మర్డర్స్ జరుగుతాయి. విలన్ ఎంట్రీ.. పోలీస్ ఇన్వెస్టిగేషన్.. ఇలా ఆసక్తికరమైన మలుపులతో సాగే కథాంశంతో కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఆది సాయికుమార్ (Adi saikumar) ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ అందుకుంటాడని అనిపిస్తోంది. మరి బ్లాక్ (Black) చిత్రం ఆదికి ఏ స్థాయిలో సక్సెస్ అందిస్తుందో చూడాలి.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International