Advertisement

సల్లంగా చూడు మల్లన్న

Feb 28 2021 @ 00:57AM
దేవుడి కల్యాణ దృశ్యం

అంగరంగవైభవంగా దేవుని కల్యాణ మహోత్సవం

చల్లనంబళ్ల  కార్యక్రమం 

ముథోల్‌, ఫిబ్రవరి 27  : మండలం లోని ఎడ్‌బిడ్‌ మల్లన్నదేవునికి శని వారం భక్తులు చల్లనంబళ్లు సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాత ర ప్రారంభమైన రెండవ రోజున ఎడ్‌ బిడ్‌ గ్రామంతో పాటు మండలంలోని కారేగాం, వెంకటాపూర్‌, చించాల, చింత కుంట. భైంసా మండలంలోని కామోల్‌, పుస్పూర్‌ గ్రామాల నుండి సైతం భక్తులు కాలినడకన  సల్లనంబళ్లు నెత్తిపైన తీసుకవచ్చి  ప్రత్యేకపూజలు చేశారు, కుటుంబ సభ్యులంతా సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం, ఆలయంలో భక్తుల సత్య నారాయణ పూజలు చేశారు. అలాగే జాతర ప్రారంభమైన మొదటిరోజు శుక్రవారం రాత్రి వేదపండితుల మధ్య దేవుడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది, మల్లన్నదేవుడి కల్యాణాన్ని తిలకిం చేందుకు అధికసంఖ్యలో తరలివచ్చారు. నిర్వాకులు భక్తులకు అన్ని ఏర్పా ట్లు చేశారు. ఈ జాతర మంగళవారం వరకు జరుగనుంది. ఈ కార్య క్రమంలో పూజరి అశోక్‌యాదవ్‌, వైస్‌ ఎంపీపీ లావణ్య రవీంధర్‌రెడ్డి, సీఐ అజయ్‌బాబు, సర్పంచ్‌ స్వర్ణలతదత్తు, నాయకులు గురుప్రసాద్‌ యాదవ్‌, నిమ్మపోతన్న, మాణిక్‌రెడ్డి, నిర్వాహకులు, గ్రామస్థులు తది తరులు పాల్గొన్నారు. 


Follow Us on:
Advertisement