Advertisement

రైతులపై దాడికి వ్యతిరేకంగా కళ్లకు గంతలతో నిరసన

Nov 29 2020 @ 00:04AM
కళ్లకు గంతలతో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

గజ్వేల్‌, నవంబరు 28: కేంద్ర ప్రభుత్వం రైతులపై జరిపిన లాఠీఛార్జి, భాష్ప వాయువు ప్రయోగాలకు వ్యతిరేకంగా సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం గజ్వేల్‌ పట్టణంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు నర్సింహులు, ఇబ్రహీం, లక్ష్మణ్‌, మహమ్మద్‌ హైమద్‌, పోచయ్య పాల్గొన్నారు.


Follow Us on:
Advertisement