సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరి
జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరి
కడప(ఎర్రముక్కపల్లి), మే 24 : పోలీసుల ద్వారా టీడీపీ మహానాడు కార్యక్రమానికి నాయకులను కార్యకర్తలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరి పేర్కొన్నారు. కడప నగరం టీడీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మ హానాడుకు వెళ్లనీయకుండా ప్రస్తుతం వైసీపీ ప్ర భుత్వం సచివాలయ సిబ్బంది, పోలీసుల ద్వారా తెలుగుదేశం పార్టీ టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులకు, కార్యకర్తలకు ఫోన్లు చేసి బెదిరించడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వ పోలీసులు, అధికారులు తెలుగుదేశంపార్టీ నాయకుల పై కార్యకర్తలపై చే స్తున్న బెదిరింపులు ఇచ్చే నోటీసుల పై హైకోర్టుకు వె ళ్తామని హెచ్చరించారు. మహానాడు కార్యక్రమానికి పోకుండా అడ్డుకోవాలని మా పై కేసులు బనాయించాలని చూస్తే వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని తెలిపారు. రాబోయే రోజుల్లో మరింతగా వైసీపీ ప్రభుత్వం పై వీరోచితంగా పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఎనఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసాపేట శివ, రాష్ట్ర వాణిజ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నబికోట శ్రీనివాసులు, ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు ఇల్లూరు ఓబులేసు, ఎస్సీసెల్ నగర ఉపాధ్యక్షుడు రాయుడు, టీఎనఎ్‌సఎ్‌ఫ అధ్యక్షుడు అనీల్, ఎస్సీసెల్ నగర కార్యదర్శి బిల్లా నవీన, కడప పార్లమెంట్ టీఎనఎ్‌సఎ్‌ఫ సోషల్ మీడియా కోర్డినేటర్ త్తిల విశ్వనాద్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.