రక్తదానంతో ప్రాణాలు నిలపొచ్చు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-18T05:43:54+05:30 IST

రక్తదానంతో మనుషుల ప్రాణాలు నిలుపవచ్చునని, యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్‌ ము షారఫ్‌ ఫారూఖీ పిలుపునిచ్చారు.

రక్తదానంతో ప్రాణాలు నిలపొచ్చు : కలెక్టర్‌
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న జడ్పీ చైర్మన్‌, కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 17 : రక్తదానంతో మనుషుల ప్రాణాలు నిలుపవచ్చునని, యువత రక్తదానానికి ముందుకు రావాలని కలెక్టర్‌ ము షారఫ్‌ ఫారూఖీ పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్మల్‌ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్‌ కె.విజయలక్ష్మి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర సాధనకు తమ రక్తం దారబోసి పోరాటాలు చేశారని అన్నారు. వారి పోరా ట పటిమతోనే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. యువత దేశరక్షణలో పా ల్గొనాలని, మానవసేవే పరమావధిగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనా లని, స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. అద నపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, జిల్లా వైద్యాధి కారి ధనరాజ్‌, సూపరెంటెండెంట్‌  దేవేందర్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతి నిధులు, యువత పాల్గొన్నారు. 

మెగా రక్తదాన శిబిరానికి విశేషస్పందన

భైంసా, ఆగస్టు 17 : వజ్రోత్సవ స్వాతంత్య్ర సంబరాల్లో భాగంగా బుధ వారం భైంసాలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేషస్పందిన లభించింది. స్థానిక ఏరియాసుపత్రిలోని బ్లెడ్‌బ్యాంకులో జరిగిన రక్తదాన శిభిరంలో 24 మంది పోలీసు సిబ్బంది, వివిధ వర్గాలకు చెందిన 88 మంది కలిపి మొత్తం 112 మంది రక్తదానం చేశారు. ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, భైంసా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పిప్పెర కృష్ణ, ఏరియాసుపత్రి సూపరిం టెండెంట్‌ డా.కాశీనాథ్‌లు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఏరియాసుపత్రి సూపరిండెంట్‌ డా. కాశీనాథ్‌, బ్లెడ్‌బ్యాంకు ఇంచార్జీ శ్రీనివాస్‌లు మాట్లాడుతూ రక్తదానంపై నెలకొని ఉన్న అపోహలను అందరు విడనాడాలన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని సూచించారు. రక్తదానంతో ఆరోగ్యం మెరుగవుతుందని పేర్కొన్నారు. ఇందులో టౌన్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌తో పాటు రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు పలువురు పాల్గొన్నారు. 

రక్తదానంతో గర్భిణి ప్రాణాలు కాపాడిన యువకుడు

నిర్మల్‌అర్బన్‌, ఆగస్టు 17 : ప్రసవసమయంలో తీవ్రమైన రక్తస్రావమైన ఓ గర్భిణిని ఆలూర్‌ గ్రామయువకులు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. సారంగాపూర్‌ మండల కేంద్రానికి చెందిన దేవో ళ్లలక్ష్మి అనే గర్భిణి ప్రసవం కోసం మాతశిశుసంరక్షణ కేంద్రంలో చేరింది. ప్రసవసమయంలో అమెకు రక్తస్రావం ఎక్కువగా కావడంతో వైద్యులు రక్తం అవసరమని సూచించారు. సమాచారాన్ని తెలుసుకున్న ఆలూర్‌ యువకుడు ప్రదీప్‌పాటు సాయికృష్ణ, దయాకర్‌, జునైద్‌ అన్వర్‌లు వెంటనే స్పందించి రక్తదానం చేశారు. దీంతో ఆమె ప్రసవం తరువాత వైద్యులు రక్తం ఎక్కించి ఆమె ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన యువకులను పలువురు అభినందించారు.

Updated Date - 2022-08-18T05:43:54+05:30 IST