రక్తదానం మహాదానం

ABN , First Publish Date - 2022-08-18T04:20:33+05:30 IST

క్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబె డుతుందని, రక్తందానం చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీ యమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ అన్నారు.

రక్తదానం మహాదానం
జడ్చర్ల : రక్తదాన శిబిరంలో దాతను అభినందిస్తున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

- ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌

మహబూబ్‌నగర్‌, ఆగస్టు 17 : రక్తదానం ఎంతో మంది ప్రాణాలను నిలబె డుతుందని, రక్తందానం చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీ యమని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ అన్నారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని బాదం రామస్వా మి ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్యశాఖ, మిషన్‌భగీరథ, రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో జిల్లా అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, వైద్యసిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రక్తం లేక ఎంతో  మంది ఇబ్బంది పడుతుంటారని, సరైన సమయంలో రక్తం ఎక్కించగలిగితే ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో మొదటి గంటలో రక్తం ఇవ్వగలిగితే చాలావరకు ప్రాణా లను కాపాడవచ్చని పేర్కొన్నారు. సైన్స్‌ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ, రక్తాన్ని కృత్రిమంగా ఎవరూ తయారు చేయలేరని, మనుషుల నుంచి మనిషికి అవసర మయ్యే ఒక విశ్వజనీనత అని గుర్తు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణ, జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాంకిషన్‌, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ శశికాంత్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ల యన్‌ నటరాజ్‌, మిషన్‌భగీరథ ఈఈలు వెంకటరమణ, పుల్లారెడ్డి పాల్గొన్నారు. 

75 వసంతాలు... 75 మంది రక్తదానం 

జడ్చర్ల : భారతదేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా జడ్చర్ల ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ శిబిరాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 75 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జ్యోతి, జడ్పీ వైస్‌చైర్మన్‌ కోడ్గల్‌ యాదయ్య, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ దోరేపల్లి లక్ష్మి, వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాది సారిక, తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి, వైద్యాధికారులు డాక్టర్‌ శివకాంత్‌, డాక్టర్‌ సమత, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

అన్నిదానాల కన్న రక్తదానం గొప్పది

దేవరకద్ర : అన్నిదానాల కన్న రక్తదానం చాలా గొప్పదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరా న్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 30 మంది రక్తదానం చేశారు. ఇదిలా ఉండగా ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీసీకుంట, దేవరకద్ర మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రెండు మండలాలకు చెందిన 214 మంది లబ్ధిదారు లకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు రమాదేవి, హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ అన్నపూర్ణ, పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు కొండారెడ్డి, నాయకులు శ్రీకాంత్‌ యాదవ్‌, కర్ణం రాజు, వెంకటేష్‌, బాలస్వామి, దొబ్బలి ఆంజనేయులు, అజ్జు, బాలరాజు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:20:33+05:30 IST