అన్నిదానాల కంటే రక్తదానం గొప్పది

Jun 14 2021 @ 23:22PM
రక్తదానం చేసిన పోలీసులను సన్మానిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

జైనూరు, జూన్‌ 14: రక్త దానం అన్ని దానాల కంటె గొప్పదని జడ్పీచైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఆదివాసీ వెల్ఫేర్‌ మిత్ర ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రక్తదాన శిబిరాన్ని జడ్పీ చైర్‌పర్సన్‌ పరిశీలించారు. రక్తదాన శిబిరంలో పోలీసులు పెద్దఎత్తున రక్తం దానం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి శాలువాలు కప్పి సన్మా నించారు. అనంతరం స్థానికఎంపీడీవో  కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో జడ్పీ చైర్‌పర్సన్‌ ప్రత్యేకసమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇటీవల వేసిన బోరు బావులపై ఆరాతీశారు. ఎంపీపీ కుంర తిరుమల, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ ఆత్రం భగ్వంత్‌ రావ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌ రావ్‌, సీఐ సీహెచ్‌ హనుక్‌, సహకారసంఘం చైర్మన్‌ కొడప హన్నుపటేల్‌,  సర్పంచులు మేస్రం పార్వతీ బాయి, కందారె బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on: