రక్తదానం.. మహాదానం

ABN , First Publish Date - 2022-08-18T05:13:06+05:30 IST

రక్తదానం.. మహాదానం

రక్తదానం.. మహాదానం
పరిగి : రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి

  • వికారాబాద్‌ డీఎంహెచ్‌వో తుకారాం
  • వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరాల ఏర్పాటు 
  • పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, దాతలు

వికారాబాద్‌/పరిగి రూరల్‌/తాండూరు/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కొడంగల్‌/పెద్దేముల్‌, ఆగస్టు 17: రక్తదానం మహాదానమని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పేర్కొన్నారు. స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో పలుచోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. వికారాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తుకారాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యదర్శి సాయిచౌదరి, డాక్టర్‌ భక్తవత్సలం, డాక్టర్‌ సత్యనారాయణగౌడ్‌, ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు రమ్య, జ్యోతి, అరవింద్‌, సాయిబాబా, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని పరిగి ఎమ్మెల్యే కె.మహే్‌షరెడ్డి పేర్కొన్నారు.

వజ్రోత్సవాల్లో భాగంగా పరిగి పట్టణ కేంద్రంలోని కొప్పుల శారద గార్డెన్స్‌లో వికారాబాద్‌ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే  ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరిగిలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన 173 మందిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం రక్త దాతలకు స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్‌లు పండ్లు, జ్యూస్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, జడ్పీటీసీ బి.హరిప్రియారెడ్డి, డీఎస్పీ కరుణ సాగర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురేందర్‌ కుమార్‌, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ భాస్కర్‌, ఎంపీడీవో శేషగిరి శర్మ, సీఐ వెంకటరామయ్య, పరిగి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సఫియా, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ఆర్‌.ఆంజనేయులు, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, పోలీసులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ సబ్బంది, వైద్యసిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా మేడ్చల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్లు దీపికా నర్సింహారెడ్డి, లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి బ్లడ్‌ బ్యాంకులో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రవిశంకర్‌, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఆనంద్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది శ్రీధర్‌గౌడ్‌ పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మండలం ప్రతా్‌పసింగారంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలోని జనని రక్తనిధి కేంద్రం ద్వారా రక్త సేకరణ చేపట్టారు. చిలుగూరి సాయిలు, కుమార్‌, ఆనంద్‌, దుర్గరాజు, రవి, భాస్కర్‌, కందుల రాజు, కళ్లెం శ్రీకాంత్‌రెడ్డి, బద్దం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కొడంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభంచారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వికారాబాద్‌ జిల్లా ఉపవైద్యాధికారి రవీంద్రయాదవ్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ఉషారాణి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మూర్తి, వైద్యురాలు శ్రావణి, మున్సిపల్‌ సిబ్బంది క్రాంతి, భరత్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే పరిగిలోని శారదా గార్డెన్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కొడంగల్‌ పోలీ్‌సస్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఈమేరకు రక్తదాత కానిస్టేబుల్‌ పాషాకు పరిగి డీఎస్పీ కరుణ సాగర్‌రెడ్డి సర్టిఫికెట్‌ అందించారు. కొడంగల్‌ ఎస్సై రవిగౌడ్‌, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

  • పెద్దేముల్‌లో 50 మీటర్ల జాతీయజెండా ప్రదర్శన

వజ్రోత్సవాల్లో భాగంగా పెద్దేముల్‌ మండల కేంద్రంలో ఏబీవీపీ(తాండూరు) ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే 50మీటర్ల జాతీయజెండాను ప్రదర్శించారు. ఎస్‌ఐ రవూఫ్‌, ఆర్‌ఎ్‌సఎస్‌ ఖండ బౌద్ధిక్‌ప్రముఖ్‌ అశోక్‌,  ఏబీవీపీ సోషల్‌మీడియా కో- కన్వీనర్‌ ఉప్పల రాజేష్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మౌనేశ్వర్‌చారి, ప్రభుత్వ కళాశాల, పాఠశాలల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T05:13:06+05:30 IST