రక్తపోటు ఇలా దూరం

ABN , First Publish Date - 2021-11-30T08:35:08+05:30 IST

పొటాషియం ఎక్కువగా దొరికే అరటిపళ్లు, పాలకూర, బ్రొకొలి, టమాటాలు, పళ్లు ఎక్కువగా తినాలి. పాలకూర పచ్చి వాసన వస్తుందని దూరం పెట్టవలసిన అవసరం లేదు...

రక్తపోటు ఇలా దూరం

రక్తపోటు హఠాత్తుగా పెరుగుతూ, తరుగుతూ ఉంటే, 

దాన్ని స్థిరంగా ఉంచే మార్గాలను అనుసరించాలి. అందుకోసం 

తోడ్పడే ఉపాయాలు ఇవి.

ఫ పొటాషియం: పొటాషియం ఎక్కువగా దొరికే అరటిపళ్లు, పాలకూర, బ్రొకొలి, టమాటాలు, పళ్లు ఎక్కువగా తినాలి. పాలకూర పచ్చి వాసన వస్తుందని దూరం పెట్టవలసిన అవసరం లేదు. మరిగే నీళ్లలో వేసి, రెండు నిమిషాల పాటు ఉడికించి, స్మూదీల్లో కలుపుకుని తాగవచ్చు. అలాగే సలాడ్‌తో కలిపి తినవచ్చు. 

ఫ అవిసె గింజలు: వీటిలో ఉండే ఒమేగా3, పీచు రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడతాయి. మట్టి వాసన వేసే వీటిని ఎలా తినాలబ్బా? అని కంగారు పడకుండా, వీటిని దోరగా వేయించి, పొడి కొట్టుకుని పండ్లరసాల్లో, స్మూదీల్లో కలుపుకుని తాగండి.  ఓట్‌మీల్‌, సలాడ్లలో కూడా కలుపుకోవచ్చు.

ఫ ఇవి దూరం: మాంసం, చక్కెర, పాల ఉత్పత్తులు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ కారకాలు. కాబట్టి వీటికి ప్రత్నామ్నాయాలను ఎంచుకోవాలి. మాంసకృత్తుల కోసం అవకాడొ, పప్పులు, పుట్టగొడుగులను తీసుకోవచ్చు. క్యాల్షియం కోసం నువ్వులు, మెంతులు, ఆకుకూరలు వాడుకోవచ్చు. తీపి కోసం ఖర్జూరం, ఇతరత్రా పండ్లు తినవచ్చు. 

 పీచు: శరీరంలోని బోలెడన్ని జీవక్రియలకు పీచు అవసరం. పోషకాలను శరీరం శోషించుకోవాలన్నా, పేగుల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలన్నా, త్వరగా ఆకలి వేయకుండా ఉండాలన్నా పీచు తినాలి. పొట్టు తీయని ధాన్యాలు, అవకాడో, అవిసె గింజలు, షియా 

విత్తనాలు, యాపిల్స్‌లలో పీచు ఎక్కువ.

Updated Date - 2021-11-30T08:35:08+05:30 IST