ltrScrptTheme3

‘‘లైవ్ షో కొనసాగుతుండగానే, నా గుండెలోని రక్తం, యద లోపలి భాగంలో చింద సాగింది!’

Oct 7 2021 @ 16:45PM

రిచీ ఫాల్క్‌నర్... బ్రిటన్‌కు చెందిన ప్రఖ్యాత గిటారిస్ట్... రీసెంట్‌గా స్టేజీ మీదే కుప్పకూలాడు. ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘జుడాస్ ప్రీస్ట్’ మ్యూజిక్ బ్యాండ్‌ టీమ్‌లో ప్రధాన గిటారిస్ట్‌గా సుప్రసిద్ధుడు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ కలిగిన 40 ఏళ్ల ఇంగ్లీష్ మ్యూజీషియన్ సెప్టెంబర్ 27న అమెరికాలోని కెంటకీలో తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. లైవ్ షోలో అతడికి మెడికల్ ఎమర్జెన్సీ ఎదురుకావటంతో హుటాహుటిన దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.


‘‘నా ప్రధాన దమని(అరోటా) చిట్లిపోవటంతో, నా గుండెలోంచి బయటకు వస్తోన్న రక్తం మొత్తం, ఛాతి లోపలి భాగంలో చిమ్మింది!’’ గత వారం ఓపెన్ హార్ట్ సర్జరీ తరువాత ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డ రిచీ ఫాల్క్‌నర్ చెప్పిన తాజా మాటలివి. ఆయన సర్జన్ తనకి చెప్పిన దాని ప్రకారం... ఇలాంటి తీవ్రమైన సమస్య ఎదురైన వారు... సాధారణంగా హాస్పిట‌ల్ దాకా సజీవంగా రాలేరట. కానీ, రిచీ అత్యంత ప్రమాదకర కార్డియాక్ ఎమర్జెన్సీ నుంచీ సేఫ్‌గా బయటపడటంతో అభిమానులు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. 


ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోన్న ‘జుడాస్ ప్రీస్ట్’ మ్యూజిక్ బ్యాండ్ రీచీ ఆరోగ్యం కుదుటపడ్డాక తమ టూర్ కంటిన్యూ చేస్తామని ప్రకటించింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.