రానున్న పాతికేళ్ళకు బ్లూప్రింట్ ఈ బడ్జెట్‌లో : నిర్మల సీతారామన్

ABN , First Publish Date - 2022-02-01T16:41:15+05:30 IST

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ఉదయం

రానున్న పాతికేళ్ళకు బ్లూప్రింట్ ఈ బడ్జెట్‌లో : నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 100 సంవత్సరాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌లో రానున్న 25 ఏళ్ళకు బ్లూప్రింట్ ఉందని చెప్పారు. ద్రవ్య స్థితిపై పూర్తి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటున్నట్లు తెలిపారు. గృహ నిర్మాణంపై దృష్టి సారించామన్నారు. తాము చేపడుతున్న చర్యలకు చెప్పుకోదగ్గ ఫలితాలు వస్తున్నాయన్నారు. స్వయం సమృద్ధి సాధించడంపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టిందన్నారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందన్నారు. ఆత్మ నిర్భర్ మిషన్ క్రింద 60 లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందన్నారు. మూల ధన వ్యయం పెరిగిందన్నారు. ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం రాబోతోందన్నారు. వెనుకబడిన వర్గాలు, యువత, రైతులపై ప్రధాన దృష్టితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 


Updated Date - 2022-02-01T16:41:15+05:30 IST