ఇన్‌స్టాలో బ్లూరైస్‌ హవా

ABN , First Publish Date - 2021-01-24T15:40:18+05:30 IST

ఇన్‌స్టాలో ఎప్పుడు ఏది ట్రెండవుతుందో చెప్పలేం. ఇప్పుడు చాలామంది ‘బ్లూరైస్‌’ ఫోటోలను పోస్టు చేస్తున్నారు

ఇన్‌స్టాలో బ్లూరైస్‌ హవా

ఇన్‌స్టాలో ఎప్పుడు ఏది ట్రెండవుతుందో చెప్పలేం. ఇప్పుడు చాలామంది ‘బ్లూరైస్‌’ ఫోటోలను పోస్టు చేస్తున్నారు. మొన్నటికి మొన్న బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ తన స్నేహితులతో కలిసి బ్లూరైస్‌ తింటున్నట్టు ఫోటో పెట్టింది. దీంతో ఇన్‌స్టాలో బ్లూరైస్‌ హవా మొదలైంది. ఈ నీలి అన్నానికి థాయ్‌లాండ్‌, మలేషియాలలో చాలా డిమాండ్‌. అక్కడ దీన్ని ‘నాసి కెరాబు’ అంటారు. అక్కడి రెస్టారెంట్‌లలో హాట్‌ ఫేవరేట్‌ డిష్‌ ఇది. అందుకే సెలబ్రిటీ వంటకంగా మారిపోయింది. మరి ఈ బియ్యానికి నీలిరంగు ఎలా వస్తుంది? ‘బటర్‌ఫ్లై పీ ఫ్లవర్‌’ వల్ల. ఇది నీలిరంగు పూవు. మన దగ్గర కూడా విరివిగా దొరుకుతాయివి. శంఖం పూలు అని పిలుస్తాం. ఈ పూలను పానీయాలకు నీలం రంగు అద్దేందుకు ఉపయోగిస్తారు. అదే విధంగా వీటిని వాడి అన్నాన్ని నీలం రంగులోకి మారుస్తున్నారు. ఈ పూలలో ఔషధగుణాలు కూడా చాలా ఎక్కువ. తింటే ఆరోగ్యానికి మంచిది. దీంతో ఆహారప్రియులు కూడా తినేందుకు వెనుకాడడం లేదు. ఈ పూలను నీళ్లలో మరగబెడితే, ఆ నీళ్లు నీలం రంగులోకి మారిపోతాయి. ఆ నీళ్లతోనే అన్నం వండితే బ్లూ రైస్‌ సిద్ధం. 

Updated Date - 2021-01-24T15:40:18+05:30 IST