Dubai నుంచి వచ్చేవారికి కొత్త మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-12-25T17:20:41+05:30 IST

దుబాయ్ నుంచి ముంబై వచ్చేవారికి మహారాష్ట్ర సర్కార్ శుక్రవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Dubai నుంచి వచ్చేవారికి కొత్త మార్గదర్శకాలు

ముంబై: దుబాయ్ నుంచి ముంబై వచ్చేవారికి మహారాష్ట్ర సర్కార్ శుక్రవారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దుబాయ్ నుంచి వచ్చే ముంబై వాసులు ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండడం తప్పనిసరి. వార్డ్ వార్ రూమ్ అబ్జర్వేషన్‌లో ఇది ఉంటుందని బృహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) వెల్లడించింది. ఏడో రోజున పీసీఆర్ టెస్టు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో నెగెటివ్ వస్తే.. ట్రావెలర్ మరో వారం రోజులు సెల్ఫ్-మానిటర్‌లో ఉండాలి. ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ వ్యక్తిని ఇన్సిట్యూషనల్ క్వారంటైన్ కేంద్రానికి తరలిస్తారు. 


ప్రయాణ మార్గదర్శకాలు...

* దుబాయ్ నుంచి వచ్చే ముంబై రెసిడెంట్స్‌కు ఏడు రోజుల క్వారంటైన్ తప్పనిసరి.

* అరైవల్ టైంలో పీసీఆర్ టెస్టు అవసరం లేదు.

* ప్రయాణికులు ఎవరైతే ముంబై వాసులు కాకుండా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఉంటారో వారిని వారి సొంత స్థలాలకు తరలించడం జరుగుతుంది.

* మహారాష్ట్రలోని వేరే ప్రాంతాలకు చెందిన దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసులను వినియోగించకూడదు.

* ఇతర రాష్ట్రాలకు లేదా మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు కనెక్టింగ్ ఫ్లైట్‌లలో ప్రయాణించే ప్రయాణికులు విమానాలు ఎక్కేందుకు అనుమతి ఉంటుంది.


దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి భారత విమానాశ్రయ అధికారులు సంబంధిత ముంబై విమానాశ్రయ అధికారికి ఈ మేరకు సమాచారం అందించారు. బీఎంసీ సర్క్యూలర్ ప్రకారం ఒమైక్రాన్ కేసుల సంఖ్య పెరగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులను పర్యవేక్షించడం చాలా అవసరం. ముఖ్యంగా హై రిస్క్ దేశాల నుండి వచ్చేవారు. ఇక విమానాశ్రయంలో ప్రయాణికులు విమానాలు మార్చే ప్రధాన కేంద్రంగా దుబాయ్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Updated Date - 2021-12-25T17:20:41+05:30 IST