బీఎన్‌ రహదారి అధ్వానం

ABN , First Publish Date - 2021-07-28T05:46:20+05:30 IST

మండలంలో భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్‌) రహదారి రూపురేఖలు మారిపోయింది. రోడ్డు మధ్యలో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి.

బీఎన్‌ రహదారి అధ్వానం
బీఎన్‌ రోడ్డులో ఎల్‌.సింగవరం వద్ద ఏర్పడిన గుంతలు

రోడ్డంతా గుంతలు.. మారిన రూపురేఖలు

వాహన చోదకులు, ప్రయాణికు అగచాట్లు


బుచ్చెయ్యపేట, జూలై 27: మండలంలో భీమునిపట్నం-నర్సీపట్నం (బీఎన్‌) రహదారి రూపురేఖలు మారిపోయింది. రోడ్డు మధ్యలో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడ్డాయి. వర్షాలకు నీరు చేరి ప్రమాదకరంగా తయారైంది. దీనికితోడు వడ్డాది, బంగారుమెట్ట జంక్షన్‌లు నీటి ముంపునకు గురవుతున్నాయి. పెద్దేరు వంతెన అప్రోచ్‌ గోతులమయంగా మారింది. అలాగే ఎల్‌.సింగవరం వద్ద రోడ్డు శిథిలావస్థకు చేరుకుంది. పొట్టిదొరపాలెం, గొల్లకొంపలు వద్ద రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వాహన చోదకులు, ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. అలాగే వాహనదారులకు ఎప్పటికప్పుడు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి బీఎన్‌ రోడ్డుకు తక్షణమే మరమ్మతు పనులు చేపట్టాలని వాహన చోదకులు, ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - 2021-07-28T05:46:20+05:30 IST