రేపు, లేదా... ఎల్లండి... ఐపీఓకు... ‘బోట్’...

ABN , First Publish Date - 2022-01-26T22:04:02+05:30 IST

అతి పెద్ద డైరెక్ట్-టు-కన్స్యూమర్, ఆడియో బేస్డ్‌ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో ఒకటైన ‘బోట్’... ప్రైమరీ మార్కెట్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టబోతోంది.

రేపు, లేదా... ఎల్లండి... ఐపీఓకు... ‘బోట్’...

లక్ష్యం... రూ. 2 వేల కోట్లు...

హైదరాబాద్ : అతి పెద్ద డైరెక్ట్-టు-కన్స్యూమర్, ఆడియో బేస్డ్‌ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్లలో ఒకటైన ‘బోట్’... ప్రైమరీ మార్కెట్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టబోతోంది. సెబీకి రూ. 2 వేల కోట్ల ఐపీఓ పేపర్లను ఒకటి, రెండు రోజుల్లో ఫైల్ చేయనుంది. గురువారం లేదా అంతకన్నా ముందే పేపర్లు ఫైల్‌ చేసే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల సమాచారుం. న్యూదిల్లీ కేంద్రంగా పని చేస్తున్న బోట్... ఈ ఐపీవో ద్వారా $ 1.5-2 బిలియన్ల విలువను ఆశిస్తోంది. బోట్‌లో దాదాపు 36 % వాటాతో ఉన్న ఏకైక అతి పెద్ద వాటాదారు ప్రైవేట్ ఈక్విటీ మేజర్ 'వార్‌బర్గ్ పింకస్'. కాగా... ఐపీఓలో రూ. 700-800 కోట్ల విలువైన షేర్లను ఇది ఆఫ్‌లోడ్‌ చేయనుంది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులు కూడా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా వాటాలను విక్రయించనున్నారు.  


వ్యవస్థాపకులు అమన్ గుప్తా, సమీర్ మెహతాకు కలిపి సంస్థలో దాదాపు 56 % వాటా ఉంది. వీళ్ల హోల్డింగ్‌లోనూ కొంతభాగాన్ని తగ్గించవచ్చని వినవస్తోంది. గతేడాది ఏప్రిల్‌లో క్వాల్‌కామ్ వెంచర్స్ నుంచి రూ. 50 కోట్లను సేకరించినప్పుడు బోట్ విలువ చివరగా రూ. 2,200 కోట్లకు చేరింది. ఇక... ఈ ఆర్థిక సంవత్సరంలో దాని ఆదాయం కంటే 5-6 రెట్ల వాల్యుయేషన్‌పై సంస్థ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం మార్చి చివరి నాటికి ఆదాయాన్ని దాదాపు రెట్టింపు చేస్తారని వినవస్తోంది. కాగా... 2021 ఆర్ధిక సంవత్సరంలో... పంస్థ 1,500 కోట్ల ఆదాయంతోపాటు, రూ. 78 కోట్లకు పైగా నికరలాభాన్ని ఆర్జించింది. ఇటీవల లిస్టైన న్యూ-ఏజ్‌ కంపెనీల స్టాక్స్‌ పతనమవుతుండడాన్ని దృష్టిలో పెట్టుకుని, దీని ఐపీవో ప్రైస్‌ను మార్చవచ్చునని వినవస్తోంది. 


ప్రస్తుతం దీని ఐపీఓ పత్రాలు పరిశీలన తుది దశకు చేరుకుంది. మరో పది రోజుల్లో చివరి పరిశీలనలు పూర్తవుతాయి. దీనికి తగ్గట్లు ఫైనల్‌ డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను కంపెనీ ఫైల్‌ చేస్తుంది. రూ. 7 వేల కోట్ల ప్రైమరీ ఇష్యూ సహా రూ. 8,430 కోట్లను సమీకరించే లక్ష్యంతో గతేడాది 

Updated Date - 2022-01-26T22:04:02+05:30 IST