బోసినవ్వుల మా బాబుకు మీ సాయం కావాలి

ABN , First Publish Date - 2021-06-09T21:59:05+05:30 IST

సుమారు 11 సంవత్సరాల పాటు మేము సంతానం కోసం దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాం. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయాం. చివరికి నేను గర్భవతిని అయినప్పుడు నేను, నా భర్త అంతులేని ఆనందంతో దాదాపు షాక్ అయ్యాం...

బోసినవ్వుల మా బాబుకు మీ సాయం కావాలి

సుమారు 11 సంవత్సరాల పాటు మేము సంతానం కోసం దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నాం. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయాం. చివరికి నేను గర్భవతిని అయినప్పుడు నేను, నా భర్త అంతులేని ఆనందంతో దాదాపు షాక్ అయ్యాం.


కానీ, ఈ ఆనందం ఆట్టే కాలం నిలబడలేదు.దాదాపు రెండేళ్ళ కిందట... అంటే, 2019లో మాకు అబ్బాయి పుట్టాడు.జనవరి 2021లో వాడు అనారోగ్యం పాలయ్యాడు.


మొదట్లో బాబుకు జ్వరం వస్తుండటం గమనించాము. మాములుగా చేసే చికిత్సలేవీ పనిచెయ్యలేదు.ఎంతో కంగారుపడి బాబును ఆస్పత్రికి తీసుకెళ్లాం. డాక్టర్ గారి సలహాపైన కొన్ని టెస్టులు చేయించాం.ఆ టెస్టుల ఫలితాల మా గుండెల్ని చీల్చేశాయి.



ఆ మర్నాడు డాక్టర్లు మా అబ్బాయిని చూసి Wiskott-Aldrich Syndrome with Refractory Thrombocytopenia and autoimmune vasculitis సమస్య ఉన్నట్లు తేల్చి చెప్పారు.


నేను, నా భర్త ఏం చెయ్యాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో పడ్డాం.బాబును ఈ అనారోగ్య సమస్య నుంచి బయటపడేసే ఏకైక మార్గం బోన్ మారో ట్రీట్‌మెంట్ మాత్రమే.దురదృష్టవశాత్తు, ఈ ట్రాన్స్‌ప్లాంట్ చెయ్యడానికి, పోస్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కేర్‌కి కలిపి దాదాపుగా రూ.25 లక్షలు ($ 34506.65).మా కుటుంబానికి ఆధారం నా భర్త ఒక్కడే. ఒక చిన్న షాప్‌కీపర్ అయిన ఆయన నెల సంపాదన కేవలం రూ.6,000 మాత్రమే.


సాయం చేయడానికి క్లిక్ చేయండి


మా అబ్బాయి చికిత్స కోసం ఇప్పటి వరకూ మా బంధువుల వద్ద చాలా చేబదులు చేశాము. ఇది చాలక ఇతరుల నుంచి అప్పు చేశాము. మాకున్న కొద్దిపాటి నగలు అమ్మేశాము.మాకు ఇక డబ్బు పుట్టే అవకాశాలేమీ లేవు.మా అబ్బాయితో నేను గడిపిన ప్రతి క్షణమూ ఎంతో తియ్యనైనది. ముద్దొస్తూ, ప్రేమను ఒలకబోస్తూ వాడే మా లోకమయ్యాడు.


నా కొడుకును రక్షించుకోవడానికి నేను ఏం చెయ్యడానికైనా సిద్ధమే. ఇంజక్షన్ సూదులు గుచ్చుకుని నోప్పితో వాడు బాధపడుతుండే నాకెంతో వేదనగా ఉంది.కానీ ఇది తప్ప మరో మార్గం లేదని మాకు తెలుసు.నా కొడుక్కి బోన్ మేరో ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం మా ఆయనే దాతగా ఉన్నాడు.

 

మేం గనుక డబ్బు సర్దుబాటు చేసుకోగలిగితే, మా అబ్బాయికి కొత్త జీవితం వస్తుంది.అది జరగాలంటే, మీ అందరి తోడూ కావాలి. ఉదార హృదయంతో ఆర్థిక సహాయం చేసి మా అబ్బాయి బోసి నవ్వుల్ని నిలబెట్టండి.



నా కొడుకు కోసం విరాళాలు అందించాల్సిందిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను.వాడు బాగుపడేందుకు మీరిచ్చే మొత్తం ఎంత చిన్నదైనా ఫరవాలేదు.ఈ దురదృష్టకర పరిస్థితుల్లో మేం ధైర్యంగా ముందడుగు వెయ్యడానికి సహకరించండి.


14 నెలల వయస్సున్న ఈ పసి ప్రాణమే నా జీవితం. వాడే నాజీవితం... వాడే నాకంతా. వాడు లేకుండా నేను బ్రతకలేను. మీ సాయమే మాకు అండా దండా.

Updated Date - 2021-06-09T21:59:05+05:30 IST