బోడసకుర్రు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాట్లు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-04-23T05:49:23+05:30 IST

అల్లవరం మండలం బోడసకుర్రు లో పునఃప్రారంభించ నున్న కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ అధికారులను ఆదేశించారు.

బోడసకుర్రు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌   ఏర్పాట్లు పూర్తిచేయాలి

 సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌

అల్లవరం, ఏప్రిల్‌ 22: అల్లవరం మండలం బోడసకుర్రు లో పునఃప్రారంభించ నున్న కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో ఏర్పాట్లు త్వరితగతిన పూర్తిచేయాలని సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొవిడ్‌ రెండో దశలో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున కొవిడ్‌కేర్‌ సెం టర్‌లోని అన్ని బ్లాక్‌లలో ఏర్పాట్లును పూర్తిచేయాలన్నారు. గురువారం సబ్‌కలెక్టర్‌ హిమాన్షుకౌశిక్‌, అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో పరిశీలన చేశారు. విద్యుత్‌  సరఫరాకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని ఆదేశించారు. డీఎల్‌పీవో ఆర్‌.విక్టర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ వి.అయ్యప్పనా యుడు, తహశీల్దార్‌ ఎస్‌.అప్పారావు, ఆర్‌ఎంవో నితీష్‌కు మార్‌, ఆర్‌ఐ దుర్గాశ్రీను, వీఆర్వో చిట్టిబాబు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-23T05:49:23+05:30 IST