కోల్‌కతా నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం రాకెట్

Published: Sat, 22 Jan 2022 12:16:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కోల్‌కతా నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం రాకెట్

గయలో వ్యభిచారం గుట్టురట్టు...విటులుగా హై ప్రొఫైల్ వ్యక్తులు

బుధ్ధ గయ (బీహార్): ప్రముఖ పర్యాటక కేంద్రమైన బుద్ధ గయలో సాగుతున్న వ్యభిచారం రాకెట్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. కోల్‌కతా నగరం నుంచి అందమైన అమ్మాయిలను కాంట్రాక్టుపై తీసుకువచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారని పోలీసులు దర్యాప్తులో వెలుగుచూసింది.గయా పోలీసులు వ్యభిచారం రాకెట్ నిర్వాహకుడితో పాటు 14 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో సెక్స్ రాకెట్‌లో ఇరుక్కున్న ఇద్దరు బాలికలను కూడా పోలీసులు రక్షించారు. బుద్ధ గయలోని హై ప్రొఫైల్ వ్యక్తులు చాలా మంది విటులుగా ఈ వ్యభిచార గృహానికి వస్తున్నారని పోలీసులు తేల్చారు. వ్యభిచార రాకెట్ నిందితుల నుంచి మొత్తం 16 మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు గయా పోలీసులు తెలిపారు. 

కోల్‌కతా నుంచి అందమైన అమ్మాయిలను తీసుకువచ్చి వ్యభిచారం రాకెట్

వ్యభిచార రాకెట్ నిర్వాహకుడి మొబైల్‌లో 1500 మంది విటుల ఫోన్ నంబర్లను సేవ్ చేశారని వెల్లడైంది. ఈ విటుల జాబితాలో గయా నగరానికి చెందిన చాలా మంది హై ప్రొఫైల్ పేర్లు కూడా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.బుద్ధ గయా పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిమా హోటల్ పక్కనే ఉన్న బినామీ గెస్ట్ హౌస్‌లో ఈ సెక్స్ రాకెట్ రహస్యంగా నడుస్తోందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య కుమార్ విలేకరులకు చెప్పారు. ఈ బినామీ అతిథి గృహం నిర్వహణ కూడా మహిళా హోటల్ నిర్వాహకులే చేస్తున్నారు. పోలీసులు దాడి సమయంలో 14 మంది కస్టమర్లు ఉండగా, హోటల్ నిర్వాహకుడు కూడా అక్కడే ఉన్నాడు. 

వ్యభిచారం రాకెట్ కు ప్రముఖ వైద్యులు, బడాబాబులున్నారని పోలీసులు చెప్పారు. వ్యభిచార గృహానికి రూ.15వేలు ఫీజుకింద చెల్లించి బడా బాబులు అమ్మాయిల వద్దకు విటులుగా వస్తున్నారని పోలీసులు తేల్చారు. గయ నగరంలో హైప్రొఫైల్ వ్యభిచారం రాకెట్ బయటపడటం బీహార్ రాష్ట్రంలోనే సంచలనం రేపింది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.