భరించలేని దుర్వాసన.. రెండేళ్లుగా ఇదే తీరు.. తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం!

ABN , First Publish Date - 2022-02-22T03:39:15+05:30 IST

రెండేళ్లుగా ఓ ఫ్లాట్ లోంచి దుర్వాసన వస్తోంది. హౌసింగ్ సోసైటీ వారికి ఆ అపార్ట్‌మెంటు వాసులు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. కంపు భరించలేకపోయిన ఓ యువతి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు వచ్చి ఆ ఇంటి తలుపు బద్దలు కొట్టి చూస్తే షాకింగ్ దృశ్యం కనిపించింది.

భరించలేని దుర్వాసన..  రెండేళ్లుగా ఇదే తీరు.. తలుపులు బద్దలు కొట్టి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం!

ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్లుగా ఓ ఫ్లాట్ లోంచి దుర్వాసన వస్తోంది. హౌసింగ్ సోసైటీ వారికి ఆ అపార్ట్‌మెంటు వాసులు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకపోయింది. కంపు భరించలేకపోయిన ఓ యువతి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాళ్లు వచ్చి ఆ ఇంటి తలుపు బద్దలు కొట్టి చూస్తే షాకింగ్ దృశ్యం కనిపించింది. ఓ అస్థిపంజరం కూర్చీలో కూర్చున్న స్థితిలో కనిపించడంతో పోలీసులతో సహా అక్కడున్న వారందరికీ దిమ్మతిరిగిపోయింది. లండన్‌లో ఉన్న పెచ్‌కమ్‌ ప్రాంతంలోని సెయింట్ మేరిస్ రోడ్డులో ఇటీవల ఈ ఘటన చోటు చేసుకుంది. 


కాగా.. ఆ అస్థిపంజరం మేరినెల్లా బరెట్టా అనే మహిళది అని పోలీసులు తెలిపారు. 2019 ఏప్రిల్ తరువాత..  ఆమె ఆపార్ట్‌మెంట్‌లోని వారెవరికీ కనిపంచలేదని పేర్కొన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె గురించి మరిన్ని  వివరాలు తెలుసుకునేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ ఘటన లండన్‌లో కలకలం రేపుతోంది.

Updated Date - 2022-02-22T03:39:15+05:30 IST