ప్రైవేటు విద్యాసంస్థలో బయటిప్రాంతాల ఓటర్లు

ABN , First Publish Date - 2021-11-15T07:34:43+05:30 IST

అధికార పార్టీ సర్పంచికి చెందిన కుప్పంలోని విద్యాసంస్థ భవనంలో దొంగ ఓటర్లు దిగిపోయారని సమాచారంతో అందడంతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాత్రి అక్కడకు చేరుకున్నాయి.

ప్రైవేటు విద్యాసంస్థలో బయటిప్రాంతాల ఓటర్లు
పోలీసులతో వాగ్వాదం చేస్తున్న టీడీపీ కార్యకర్తలు

కుప్పం, నవంబరు 14: ఆదివారం రాత్రి గడిచేకొద్దీ దొంగ ఓటర్ల అంశం కుప్పంలో ఉద్రిక్తత పెంచుతూ పోయింది. పట్టణంలోని ఓ అధికార పార్టీ సర్పంచికి చెందిన ప్రైవేటు విద్యా సంస్థ భవనంలో ఇతర ప్రాంతాలకు చెందిన దొంగ ఓటర్లు దిగిపోయారని సమాచారం అందడంతో టీడీపీ శ్రేణులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నాయి. లోనికి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు వెళ్లనివ్వలేదు. ఇక్కడెవరూ లేరని, ఎన్నికల సిబ్బంది కోసం భోజనాలు వండుతున్నారని చెప్పారు. తమలో ఐదుగురిని లోనికి పంపిస్తే నిర్ధారించుకుంటామని టీడీపీ శ్రేణులు చేసిన విజ్ఞప్తిని వారు తిరస్కరించారు. ఈ విషయమై పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. ఉద్రిక్తత ఏర్పడింది. చివరకు అక్కడినుంచి టీడీపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టి వెనక్కు పంపించేశారు.

Updated Date - 2021-11-15T07:34:43+05:30 IST