ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యోగాల భర్తీకి శ్రీకారం

ABN , First Publish Date - 2022-06-26T05:24:09+05:30 IST

ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యోగాల భర్తీకి శ్రీకారం

ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యోగాల భర్తీకి శ్రీకారం

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌ కుమార్‌


మామునూరు, జూన్‌ 25: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే ఉద్యోగాల భర్తీకి ప్రభు త్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అ న్నారు. మామునూరు పోలీసు శిక్షణ కళాశాలలో అరూరి గట్టుమల్లు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతుల్లో భాగం గా ఎమ్మెల్యే అరూరి రమే్‌షతో కలిసి శనివారం శిక్షణార్థులకు స్టడీ మెటీరియల్‌ను అంద జేశారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణలో ఆకలి కేకలు, రైతుల ఆత్మహత్యలు జరగడానికి ఆనాటి ఆంధ్ర పాలకులే కారణమన్నారు. కార్యక్రమంలో పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందారపు పూజ, అసిస్టెంట్‌ కమాండెంట్‌ భిక్షపతి, మామునూరు ఏసీపీ నరేష్‌ కుమార్‌, రిటైర్డ్‌ ఏసీపీ ఉదయ్‌ కిరణ్‌, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు, ఈదురు అరుణవిక్టర్‌ పాల్గొన్నారు. 


రాకేశ్‌ కుటుంబ సభ్యులకు పరామర్శ

ఖానాపురం : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో పోలీసుల కాల్పుల్లో మృతిచెందిన దామెర రాకేశ్‌.. కుటుంబ సభ్యులను శనివారం దబీర్‌పేటలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. రాకేశ్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. రాకేశ్‌ తల్లి పూలమ్మను ఓదార్చారు. అధైర్యపడొద్దని, ప్రభుత్వపరంగా అన్నివిధాలా ఆదకుంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ నాయకుడు సంగులాల్‌, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, వైస్‌ఎంపీపీ రామసహాయం ఉమాఉపేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్‌, హట్యా, సుమన్‌, అశోక్‌, ఎంపీటీసీ భట్టు శంకర్‌, రాజు ఉన్నారు. 

Updated Date - 2022-06-26T05:24:09+05:30 IST