సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తే తప్పేంటి.. బాగుంటే హక్కులు కొని మరీ తీస్తున్నాం.. Akshay Kumar తాజా కామెంట్స్

Published: Sat, 21 May 2022 20:42:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సౌత్ సినిమాల్ని రీమేక్ చేస్తే తప్పేంటి.. బాగుంటే హక్కులు కొని మరీ తీస్తున్నాం.. Akshay Kumar తాజా కామెంట్స్

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను  తిరగరాసే నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఏడాదికి ఐదు నుంచి ఆరు సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య అక్షయ్ నుంచి వచ్చిన చిత్రం ‘బచ్చన్ పాండే’(Bachchhan Paandey). కృతిసనన్, అర్షాద్ వార్సీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేకపోయింది. అందువల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌‌లో భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. అందువల్ల సౌత్ వర్సెస్ బాలీవుడ్ అంశంపై అక్కడ డిబేట్ జరుగుతోంది. సౌత్ మూవీస్ రీమేక్స్‌పై కూడా జోరుగా చర్చించుకుంటున్నారు. సౌత్, నార్త్‌ల మధ్య పోటీ కంటే సహకారంగానే చూస్తానని అక్షయ్ చెప్పారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయంపై కూడా స్పందించారు. 


సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో ఇబ్బందులేమిటీ అని ప్రశ్నించారు. ‘‘నా సినిమాని తెలుగులో రీమేక్ చేశారు. అక్కడ బంపర్ హిట్ కొట్టింది. ‘విక్రమార్కుడు’ ని ‘రౌడీ రాథోర్’ పేరుతో మేం నిర్మించాం ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. అందువల్లే చిత్రాలను రీమేక్ చేస్తే తప్పేంటి. బాగుంటే హక్కులు కొని మరీ తీస్తున్నాం. సౌత్, నార్త్ అని విడిపోవడం మంచిది కాదు. ఇలా విడిపోవడాన్ని నేను నమ్మను. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని ఎవరైనా అంటే నాకు అసహ్యం వేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అని నేను నమ్ముతాను. సౌత్, నార్త్ అనే వాటిపై ప్రశ్నలు అడగడం మానేస్తే బాగుంటుంది. గతంలో బ్రిటీష్ వాళ్లు ఈ విధంగానే విడగొట్టి మనల్ని పరిపాలించారు. ఇప్పటికీ మనం పాఠాలు నేర్చుకోలేదు. మనమంతా ఒకే ఇండస్ట్రీ అని నమ్మిన రోజునే మరిన్ని మంచి చిత్రాలను నిర్మించగలుగుతాం’’ అని అక్షయ్ కుమార్ చెప్పారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం పృథ్వీరాజ్’ (Prithviraj). మానుషి చిల్లర్(Manushi Chhillar) హీరోయిన్‌గా నటించారు. చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. ఢిల్లీని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ (Prithviraj Chauhan) జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మూవీ జూన్ 3న విడుదల కాబోతుంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International