సోషల్ మీడియా ఖాతాలో ఇంటి పేరును మార్చేసిన మరో సెలబ్రెటీ.. మళ్లీ పుట్టింటి పేరును జతచేయడం వెనుక..

Published: Sat, 21 May 2022 20:01:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సోషల్ మీడియా ఖాతాలో ఇంటి పేరును మార్చేసిన మరో సెలబ్రెటీ.. మళ్లీ పుట్టింటి పేరును జతచేయడం వెనుక..

సల్మాన్ ఖాన్ సోదరుడు, నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ (Sohail Khan)కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. విడాకులు కావాలంటూ తన భార్య సీమా ఖాన్‌(Seema Khan) తో కలసి ముంబై ఫ్యామిలీ కోర్టును ఆయన ఆశ్రయించారు. 1998లో పెళ్లి చేసుకున్న ఈ జంట 24ఏళ్ల తర్వాత విడాకుల కోసం గతవారం కోర్టు మెట్లెక్కారు. దంపతులుగా విడిపోతుండటంతో సోషల్ మీడియా ఖాతాలో ఆమె ఇంటి పేరును మార్చింది. సీమా ఖాన్ మోనికర్‌కు బదులుగా సీమా కిరణ్ సజ్‌దే (Seema Kiran Sajdeh) గా పేరును మార్చుకుంది. పుట్టింటి పేరును జత చేసింది. విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచే ఈ దంపతులు వేర్వేరుగా నివసిస్తున్నారు. ఈ జంట విడిపోతున్నారంటూ గతంలోనే పుకార్లు షికార్లు కొట్టాయి. 


నెట్‌ఫ్లిక్స్ కోసం కరణ్ జోహార్ (Karan Johar) ఓ షోను నిర్మించాడు. ‘ద ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’(The Fabulous Lives of Bollywood Wives) టైటిల్‌తో ఈ షో ప్రసారమయింది. సీమ, మహీప్ కపూర్, భావన పాండే, నీలమ్ కొఠారీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సీమ ఇందులో డిజైనర్ పాత్రను పోషించింది. ఈ షోలో సీమ, సొహైల్ ఖాన్ వేర్వేరుగా నివసిస్తున్నట్టు చూపించారు. అప్పటి నుంచే వీరిద్దరు విడాకులు తీసుకొబోతున్నంటూ వదంతులు షికార్లు కొట్టడం ప్రారంభించాయి. ఈ షో మొదటి ఎపిసోడ్‌లో తమ రిలేషన్ షిప్‌పై ఆమె మాట్లాడింది. ‘‘సొహైల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను ఎల్లప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను. మనకు వయసు పెరిగేకొద్ది బంధాలన్ని వేర్వేరు దారుల్లో ప్రయాణిస్తాయి’’ అని సీమా ఖాన్ చెప్పింది. సీమ, సొహైల్‌‌లకు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైంది. స్నేహంగా మొదలైన వారి ప్రయాణం ప్రేమకు దారి తీసింది. తర్వాతి ఏడాది కాలానికే వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి మొదట సీమ తల్లిదండ్రలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికి కొంత కాలానికి అంగీకరించారు. ‘ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ రెండో సీజన్‌లోను సీమ నటించనుంది. గతంలోనే సల్మాన్‌ ఖాన్‌ మరో సోదరుడు అర్భాజ్‌ ఖాన్‌ సైతం మలైకా అరోరాతో విడిపోయిన సంగతి తెలిసిందే.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International