జాక్వెలిన్‌కు ఈడీ సమన్లు

Sep 17 2021 @ 23:10PM

రూ. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసు విచారణలో భాగంగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్‌ 25న విచారణకు హాజరవ్వాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సుఖేష్‌ చంద్రశేఖర్‌ ఈడీ విచారణలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ పేరు బయటపెట్టాడు. దాంతో ఆగస్టులో ఆమెను ఈడీ ఆరుగంటల పాటు విచారించింది. కేసులో ఆమె పాత్రను నిగ్గు తేల్చేందుకు ఈడీ మరోసారి జాక్వెలిన్‌ను ప్రశ్నించాలని భావించింది. అయితే ఈ కేసులో ఆమె సూత్రధారి కాదు బాధితురాలు మాత్రమే అని జాక్వెలిన్‌ సన్నిహితులు చెపుతున్నారు.

Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.