పెళ్లి నా కెరీర్ పై ప్రభావం చూపలేదు: Malaika Arora

Published: Fri, 21 Jan 2022 20:04:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లి నా కెరీర్ పై ప్రభావం చూపలేదు: Malaika Arora

‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక’ పాటతో అలరించిన భామ మలైకా అరోరా. ఆమె తన 25ఏటనే సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. తరువాత వారికి ఒక కొడుకు కూడా పుట్టాడు. తన పెళ్లి ప్రొఫెషనల్ లైఫ్‌పై ఏ మాత్రం ప్రభావం చూపించలేదని ఆమె మీడియాతో చెప్పింది. గ్లామరస్‌గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఆ క్రమంలో ఎదురైన అడ్డంకులన్నింటిని అధిగమించానని పేర్కొంది.


‘‘పెళ్లి అనేది నా కెరీర్‌పై ప్రభావం చూపలేదు. పెళ్లి చేసుకుని పిల్లలు ఉన్నవారు గతంలో  కొద్ది మంది మాత్రమే నటించేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పెళ్లైనా కూడా నటించే వారి సంఖ్య అధికం అయింది. నేను నటనను ఎప్పుడు గ్లామర్ ఇండస్ట్రీగానే భావించాను. గ్లామరస్‌గా ఉండటానికి ప్రయత్నించి అవకాశాలను సొంతం చేసుకున్నాను’’ అని మలైకా అరోరా చెప్పింది. 

 

అర్భాజ్ ఖాన్‌ని 1998లో మలైకా అరోరా పెళ్లి చేసుకుంది. అయితే, వారు 2017లో విడాకులు తీసుకున్నారు. అర్భాజ్, మలైకా తనయుడి పేరు అర్హాన్ ఖాన్. అర్హాన్ విదేశాల్లో చదువుకుంటున్నాడు. కాగా మలైకా అరోరా ప్రస్తుతం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తోంది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...