‘దంగల్’ బ్యూటీ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏం చేసిందంటే..

Published: Thu, 27 Jan 2022 13:50:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
దంగల్ బ్యూటీ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏం చేసిందంటే..

ఆమీర్ ఖాన్ హీరోగా నటించిన ‘దంగల్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది సన్యా మల్హోత్రా. అనంతరం చేసిన  ‘పగ్లైట్’, ‘లూడో’ సినిమాలు సైతం ఈ బ్యూటీ మంచి పేరునే తెచ్చిపెట్టాయి. అయితే ఈ భామ తాజాగా చేసిన ఓ పనితో ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోంది.


సన్యాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది. అందులో.. సన్యా సిటీలోని ఓ చోట నుంచి బయటికి వచ్చి తన కారు వైపు వెళుతూ కనిపించింది. దీంతో కొందరు ఫొటోగ్రాఫర్లు ఈ భామ ఫొటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నించారు. 


ఆ సమయంలో ఓ ఫొటోగ్రాఫర్ అనుకోకుండా పే‌వ్‌మేంట్‌పై పడిపోయాడు. అది గమనించి ఈ బ్యూటీ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని పైకి లేపేందుకు ప్రయత్నించింది. అంతేకాకుండా ‘మీరు ఎలా ఉన్నారు సర్. గాయాలు అయ్యాయేమో జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ అతన్ని అడిగింది.


ఈ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది. దీంతో సన్యా మంచితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. కొందరు ‘ఆమె ఎంత మంచిదో ఇది చూస్తే తెలుస్తోంది’ అని.. ‘ఎంత ఎదిగిన ఒదిగి ఉండే నటి.. చాలా స్వీట్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆ వైరల్ వీడియోని మీరు ఓ సారి చూసేయండి..



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...