ఇండస్ట్రీలో వారిద్దరు నాకు రక్షణ కవచాలంటున్న Tabu

Published: Fri, 20 May 2022 19:45:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇండస్ట్రీలో వారిద్దరు నాకు రక్షణ కవచాలంటున్న Tabu

సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని చిత్ర పరిశ్రమల్లోను సినిమాలు చేస్తున్న నటి టబు(Tabu). ‘హమ్ నౌజవాన్’, ‘దృశ్యం’, ‘గోల్ మాల్ ఎగైన్’, ‘మక్బూల్’ వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా ఆమె మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ‌లో ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకుంది. తాను సన్నిహిత సంబంధాలకు ఎంతో ప్రాధాన్యమిస్తానని చెప్పింది. 


బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అజయ్ దేవగణ్(Ajay Devgn), డైరెక్టర్ విశాల్ భరద్వాజ్(Vishal Bharadwaj) తనకు రక్షణ కవచాలని ఆమె చెప్పింది. వారితో తనకున్న అనుబంధాన్ని మీడియాకు వివరించింది. ‘‘నాకు చాలా కాలంగా విశాల్ భరద్వాజ్, అజయ్ దేవగణ్‌లతో పరిచయముంది. నాలోని మంచి, చెడులు వారికీ బాగా తెలుసు, వారిలోని మంచి, చెడులు నాకు కూడా తెలుసు. విశాల్ భరద్వాజ్ నాకు అద్భుతమైన పాత్రలు ఇచ్చాడు. అతడితో చాలా మంచి రిలేషన్‌షిప్ ఉంది. అటువంటి రిలేషన్‌షిప్ చాలా కొద్దిమంది దర్శకులతోనే ఉంది. హీరో అజయ్ దేవగణ్‌తో కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. మా ఇద్దరికీ 13ఏళ్లున్నప్పటి నుంచే పరిచయం ఉంది. అప్పటి నుంచి ఆ బంధం కొనసాగుతుంది. విశాల్ భరద్వాజ్ , అజయ్ దేవగణ్‌లతో నేను పనిచేస్తున్న సినిమా సెట్‌ను నా రాజ్యంగా భావిస్తాను. వారిద్దరు ఇండస్ట్రీలో నాకు రక్షణ కవచాలు’’ అని టబు చెప్పింది. 


విశాల్ భరద్వాజ్, అజయ్ దేవగణ్‌లతో కలసి టబు అనేక సినిమాలకు పనిచేసింది. విశాల్ దర్శకత్వం వహించిన ‘మక్బూల్’, ‘హైదర్’ చిత్రాల్లో ఆమె నటించింది. ఈ రెండు సినిమాలు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకున్నాయి. అజయ్ దేవగణ్‌తో కూడా టబు పలు సనిమాలు చేసింది. ‘విజయ్‌పథ్’, ‘హకీకత్’ ‘గోల్‌మాల్ ఎగైన్’ వంటి చిత్రాలు అజయ్‌తో కలసి చేసింది. తాజాగా ఆమె ‘భూల్ భులయా-2’(Bhool Bhulaiyaa 2) మూవీలో కనిపించింది. ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అడ్వాణీ కీలక పాత్రలు పోషించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International